D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ జూన్ 12 (అక్షరంన్యూస్) సామాజిక న్యాయం కాంగ్రెస్ తో సాధ్యం. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఉమ్మడి రాష్ట్రంలో ఏ క్యాబినెట్ లో ఆయన గొల్ల కురుమలు మంత్రి పదవి లేని ప్రభుత్వం లేదు. రాష్ట్రంలో గొల్లలు 22 లక్షలు,కురుమలు 6 లక్షల మంది ఉన్నారు. గొల్ల కురుమలకు మంత్రి పదవి,ప్రభుత్వ సలహాదారుడు,ఒక ఎమ్మెల్సీ, ఐదు కార్పొరేషన్ చైర్మన్లు,ఐదు కమిషన్ సభ్యులు, పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్, మూడు వైస్ ప్రెసిడెంట్స్, 8 జనరల్ సెక్రటరీలు, 5 డిసిసి లు ఇవ్వాలని కోరుతున్నాం. *బీసీలకు న్యాయం జరిగిన.. అందులో గొల్ల కురుమలకు అన్యాయం జరిగింది. ప్రభుత్వ, పార్టీ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ లకు పెద్ద పీట సీఎం రేవంత్ రెడ్డి,, డిప్యూటీ సీఎం భట్టి గార్లు వేశారు. ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క కి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కి వచ్చే పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులలో గొల్ల కురుమలకు తప్పక అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లోకేష్ యాదవ్ చరణ్ కౌశిక్ యాదవ్, గౌరీ సతీష్, గజ్జి భాస్కర్ యాదవ్, కొత్త కురుమ శివకుమార్, వేణుగోపాల్ యాదవ్, జగన్ యాదవ్, మహిపాల్ యాదవ్ తదితరు యాదవ - కురుమ తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily