AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/ జమ్మికుంట : కరీంనగర్/జమ్మికుంట/, ఆగస్టు 17/అక్షరం న్యూస్: జమ్మికుంట మండల మాజీ విద్యాధికారి, ఆబాదిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జెడ్పిహెచ్ఎస్) రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు తాటిపాముల భావన రుషి కొద్దిసేపటి క్రితం గుండెపోటుతో మృతి చెందారు. విద్యారంగంలో ఎంతో అంకితభావంతో సేవలందించిన భావన రుషి మృతి పట్ల కుటుంబ సభ్యులు, బంధువులు, పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన అందించిన సేవలను పలువురు గుర్తు చేసుకుంటూ నివాళులర్పిస్తున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. భావన రుషి అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం జమ్మికుంటలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
.
Aksharam Telugu Daily