Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్/ఏప్రిల్ 1 తల్లాడ (అక్షరంన్యూస్) హిందూ ముస్లింల ఐక్యత విలసిల్లే విధంగా మతసామరస్యానికి ప్రతీకగా రంజాన్ పర్వదినం ఉంటుందని బీజేపీ ఉపాధ్యక్షుడు సంగీతం సాయిచంద్ అన్నారు. సోమవారం ఆయన తల్లాడ మండలంలోని కలకొడిమ గ్రామం లో ముస్లిం సోదరులతో కలిసి మసీదులలో ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఇస్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం సోదరులు ప్రతి రోజు ఉపవాస దీక్షలు చేస్తూ సాయంత్రం దీక్ష విరమణ చేసే ఈ పవిత్ర రంజాన్ మాసం ఎంతో గొప్పదని అన్నారు. హిందూ ముస్లింల ఐక్యతకు ఈ పండుగ ఎంతో దోహదం చేస్తుందని రంజాన్ సందర్భంగా హిందూ ముస్లింలు వండుగను జరుపుకుంటారని అన్నారు. హిందువులు ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇస్తూ వారితో కుటుంబ సభ్యుల వలే కలిసి ఉంటారని ఇలాంటి పండుగలు గ్రామాలలో సుఖసంతోషాలతో పాటు మతాల కతీతంగా ప్రతి ఒక్కరిని ఏకం చేస్తాయని ప్రతి ఒక్కరు ఇలాంటి పండుగలను పెద్ద ఎత్తున చేసుకోవాలని హిందూ ముస్లింలు ఐక్యతతో కలిసిమెలిసి ముందుకు సాగితేనే సమాజం అభివృద్ధి వధంలో ముందుకు సాగుతుందని రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీ నాయకులు రంజన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో షేక్. సైదులు, షేక్. సాదిక్ నాగులమీర, గ్రామ ముస్లిమ్ పెద్దలు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily