D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : **.. *ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ తల్లాడ నవంబర్ 10 (అక్షరంన్యూస్)* తల్లాడ రింగు రోడ్డు సెంటర్లో గుంతలు పడి నీళ్లు నిలిచి తటాఖంలో మారింది, తరచూ భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుండడంతో, గుంతలు పెద్దవై, వాహనాచౌదకులకు ఆశనిపాతం లా మారాయి, గుంతలను ఎన్ హెచ్ ఫోర్ అధికారులు పూడ్చే పరిస్థితి లేకపోవడంతో ఎస్సై సొరవతో కంకర గుంతలలో నింపారు, ఉష్ణోగ్రత పెరిగినప్పుడు దుమ్ము ఇటు పోలీస్స్టేషన్, కొత్తగూడెం వైపు అటవీ శాఖ చెక్ పోస్ట్ వరకు, బస్టాండ్ వైపు మట్టమహోటల్ వరకు, దుమ్ము వెదజల్లుతోంది, ముక్కు మూసుకోకుండా రింగ్ రోడ్డు దాటే పరిస్థితి లేదు, డివైడర్లు లేవు, సెంట్రల్ లైటింగ్ లేదు, డివైడర్లకు ఫెన్సింగ్ లేదు , డ్రైనేజీలు లేవు, మట్టమ్మ హోటల్ నిర్వాహకులు ఒక రిక్షా ఏర్పాటు చేసుకొని రెండు రమ్ములలో డ్రైనేజీ వాటర్ ను తరలించాల్సిన దౌర్భాగ్య పరిస్థితి తల్లాడలో చోటుచేసుకుంది, ఇద్దరు మంత్రులు తరచూ తల్లాడ రింగురోడ్డు నుండే రాకపోకలు సాగిస్తున్నారు, స్థానిక శాసన సభ్యురాలు ఇదే రహదారి గుండా ప్రయాణిస్తుంటారు, అయినా ఎవరు ఈ సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నించడం లేదు, తల్లాడ అభివృద్ధి కోసం అడిగే నాధుడే లేడు, గత ప్రభుత్వం మారిన ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నా, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా, పరిస్థితి ఉంది, పక్క మండలాలైనా వైరా, ఏనుకూరు, కల్లూరు అభివృద్ధి దశలో పరుగులు పెడుతున్నాయి, తల్లాడ మండల కేంద్రం జంక్షన్ రాజమండ్రి కాకినాడ, ఇటు భద్రాచలం చత్తీస్గడ్, హైదరాబాద్ వాహనాలు ఇటువైపునుండే రాకపోకలు సాగిస్తున్నాయి, మా మండలానికి ఇది కావాలి అని అడిగే నాధుడే లేడు, పట్టించుకునే అధికారులు లేరు, తల్లాడ అనాధగా మిగిలింది, రింగ్ రోడ్డు సెంటర్లో ఇటీవల లారీ బోల్తా పడింది, ఘోర ప్రమాదాలు జరిగే అవకాశం పొంచిఉంది, ఎన్ హెచ్ ఫోర్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు చూస్తున్నారే తప్ప, బొచ్చుడు కంకర పూసిన పాపాన పోలేదు, ఇకనైనా మంత్రు లో, శాసనసభ్యురా లో, అధికారు లో స్పందించి, రింగ్ రోడ్డు నిడివి తగ్గించి, వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా, రింగు సెంటర్ ను శాశ్వత ప్రాతిపదికన రోడ్డు నిర్మించి డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసి రింగురోడ్డు ను అభివృద్ధి చేయాలని వాహనచోదకులు ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు,
.
Aksharam Telugu Daily