P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ** ఓదెల/ పెద్దపల్లి సెప్టెంబర్ 05 (అక్షరం న్యూస్) ఓదెల మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమనాయకుడు ప్రొఫెసర్ కోదండరాం సర్ జన్మ దిన వేడుకలను తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గుండేటి ఐలయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్బంగా పలువురు ఉద్యమకారులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని సబ్బండ వర్గాలను ఏకం చేసిన గొప్ప ఉద్యమకారుడు కోదండరాం అని అయన చేసిన పోరాటాలను గుర్తు చేసుకుంటూ నాడు ఒక్క పిలుపు ఇచ్చిన సందర్బంగా పోరాడిన తీరు గుర్తు చేసుకుంటూ ఉద్యమకారులు కన్నీటి పర్యంతం అవ్వడం జరిగింది అని అన్నారు భవిష్యత్తు లో ఉద్యమకారులకు భరోసాగా నిలబడాలని , తెలంగాణ ఉద్యమ కారులకు ప్రభుత్వం నాయ్యం చేయాలని కోరారు... ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆర్ఎంపి పిఎంపి జిల్లా అధ్యక్షులు ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుల జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర కోఆర్డినేటర్ చర్లపల్లి సురేష్ గౌడ్ గ్రామ అధ్యక్షులు కందుల అశోక్ పటేల్ గట్టు సమ్మయ్య గడిగొప్పుల సంతోష్ వాసం రమేష్ నూతి శంకర్ నేదురు మల్లేష్ గుండేటి సాయిలు తిరుపతి రామినేని కుమారస్వామి ఇట్ట వేనా ఎల్లయ్య వేల్పుల కుమార్ యాదవ్ ఎంబడి కొమురయ్య తదితర ఉద్యమకారులు పాల్గొన్నారు...
.
Aksharam Telugu Daily