GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLAReporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /జులై -08(అక్షరం న్యూస్ ) ముస్తాబాద్ మండలం చిప్పల పల్లి గ్రామం లో విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యంతో చికిత్స పొందుతూ గ్రామ సర్పంచ్ మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. చిప్పలపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ మాచెట్టి లక్ష్మణ్ (లచ్చయ్య )ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయగా ప్రజలు ఏకగ్రీవంగా సర్పంచిగా ఎన్నుకున్నారు. కాగా గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అతడిని హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాస విడిచారు. లక్ష్మణ్ ప్రజల అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధికి కృషి చేసిన ప్రజాప్రతినిగా గుర్తింపు పొందారు ఆయన ఆకస్మిక మృతి వార్తతో చిప్పలపల్లి గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి విషయం తెలుసుకున్న ప్రజాప్రతినిధులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు అధికారులు గ్రామస్తులు ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్న తరుణంలో సర్పంచ్ మృతి చెందటంగ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు లక్ష్మణ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబానికి మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు . మృతుడికి బార్య,ఒక కూతురు, కుమారుడు ఉన్నారు.
.
Aksharam Telugu Daily