D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT. Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/కొత్తగూడ : మహబూబాబాద్ జిల్లా/ కొత్త గూడ/ మార్చి 23 (అక్షరం న్యూస్) కొత్త గూడ మండలం లోని నేటితరం యువత జలసాలకు మత్తుకు అలవాటు పడి వీజీగా సంపాదించాలని డబ్బులు సంపాదించాలని ఆలోచనతో ప్రస్తుతం కాలంలో బెట్టింగ్ యాప్స్ ఆన్లైన్లో బెట్టింగ్స్ ఆటల వైపు మొగ్గు చూపుతున్నారు ఆడి ప్రాణాలు పోగొట్టుకున్న యువత మనం రోజు చూస్తూ ఉన్నాం దీనికి తోడు మ్యాచ్ ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ప్రారంభం కానుండడంతో ఆన్లైన్ బెట్టింగులు ఎక్కువ జరిగే అవకాశం ఉంది దీనికి తల్లిదండ్రులు తమ పిల్లలు ఫోన్లో ఏం చేస్తున్నారనే విషయంపై దృష్టి సాధించాలని ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని బెట్టింగ్ ఆటలతో ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు దీనితో కొన్ని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఇలా జరగకుండా ఉండాలంటే యువత ఆన్లైన్ గేమ్లకు దూరంగా ఉండాలని ఒకవేళ ఎవరైనా ఆన్లైన్ గేములు బెట్టింగు నిర్ణయించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని లేదా100 నెంబరుకు డయల్ చేయాలని అన్నారు మండలంలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లయితే పోలీసులకు సమాచారం అందించాలని సమాచారం అందించిన వారి వివరాలు గొప్పంగా ఉంచుతామని ఎస్సై కుశకుమార్ అన్నారు
.
Aksharam Telugu Daily