Saturday, 18 April 2026 03:03:57 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఆదివాసీలకు నిత్యవసర వస్తువులు పంపిణీ ఏఎస్పి విక్రాంత్ కుమార్ సింగ్

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 04 October 2025 05:54 PM Views : 826

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/చర్ల : భద్రాద్రి కొత్తగూడెం/ చర్ల అక్టోబర్ 4/ అక్షరం న్యూస్/---- ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాలతో చర్ల మండలంలోని ఛత్తీస్ ఘడ్ రాష్ట్రానికి సరిహద్దున ఉన్న మారుమూల గిరిజన గ్రామాలైన బట్టి గూడెం బత్తినపల్లి రామచంద్రాపురం గ్రామాలను భద్రాచలం ఏఎస్పి విక్రాంత్ కుమార్ సింగ్ వాగులను దాటుకుంటూ వెళ్లి గిరిజన గ్రామాలను సందర్శించారు. వరద ప్రభావిత గ్రామాలలో నివసిస్తున్న 120 మంది ఆదివాసీ కుటుంబాలకు Nestle నెస్టేల్ కంపెనీ వారి సహకారంతో ఆదివాసీలకు నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏ ఎస్ పి విక్రాంత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని అన్నారు. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలలో నివసించే ఆదివాసీలకు విద్యా వైద్యం రవాణా వంటి కనీస సౌకర్యాలను కల్పించడమే లక్ష్యంగా పోలీస్ శాఖ పని చేస్తుందని అన్నారు. అందులో భాగంగానే జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలలో ఇప్పటివరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం ఉందని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాలలో నివసించే ఆదివాసీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వర్షాలు అనంతరం పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని డెంగ్యూ మలేరియా వంటి విష జ్వరాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తన ఆదివాసీలకు సూచించారు. అభివృద్ధి నిరోధకులైన నిషేధిత మావోయిస్టులకు ఎవరు సహకరించవద్దని అన్నారు. మావోయిస్టులకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగానైన సహకరించినట్లయితే అట్టి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఆదివాసీలకు నిత్యవసర వస్తువులను అందించడానికి ముందుకు వచ్చిన నెస్టేల్ కంపెనీ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సీ వెంట మారుమూల గిరిజన గ్రామాలను సందర్శించిన వారిలో సీఆర్పీఎఫ్ 141 బెటాలియన్ కమాండెంట్ సెబాస్టియన్ సిఐ రాజు వర్మ మరియు తదితర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :