Sunday, 29 March 2026 03:28:36 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

అభివృద్ధిలో పాలేరు నంబర్ వన్.... పేదల పాలిట ఆపద్బాంధవుడు మంత్రి పొంగులేటి 109 మందికి రూ.38.70 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ మంత్రి క్యాంప్ కార్య

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 24 January 2026 04:19 PM Views : 185

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ జనవరి 24 (అక్షరం న్యూస్) ఖమ్మం : తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మార్గనిర్దేశంలో పాలేరు నియోజకవర్గం అభివృద్ధిలో రాష్ట్రంలోనే నంబర్ వన్ స్థానంలో దూసుకెళ్తుందని మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి అన్నారు. శనివారం ఖమ్మం నగరం శ్రీనగర్ కాలనీలోని మంత్రి నివాసంలో తిరుమలాయపాలెం మండలానికి చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. మొత్తం 109 మంది బాధితులకు రూ.38.70 లక్షల విలువైన చెక్కులను అందజేస్తూ పేదల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. -సాగు, తాగునీటిలో అగ్రగామి..మ ఈ సందర్భంగా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి పొంగులేటి ప్రత్యేక చొరవతో పాలేరు నియోజకవర్గంలో సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తోందని, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఆశీర్వదించిన ప్రజలు, రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ అదే తీర్పును పునరావృతం చేయాలని కోరారు. అంకితభావంతో పనిచేయాలి.. నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు గ్రామాభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున, స్థానిక సంస్థల్లోనూ కాంగ్రెస్ ప్రాతినిధ్యం ఉంటే అభివృద్ధి మరింత వేగవంతంగా జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :