Monday, 31 August 2026 11:22:44 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

నూతన ఆసరా పెన్షన్ దరఖాస్తులకు రేపే ఆఖరి తేదీ - అర్హులు దరఖాస్తు చేసుకోగలరు. జమ్మికుంట మున్సిపాలిటీ 11 వార్డు కౌన్సిలర్ పోనగంటి విష్ణువర్ధన్

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 30 August 2026 12:13 PM Views : 94

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/ జమ్మికుంట : కరీంనగర్/జమ్మికుంట/ఆగస్టు 30/అక్షరం న్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆసరా / చేయూత పెన్షన్లకు కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు రేపే (ఆగస్టు 31) చివరి తేదీ అని కౌన్సిలర్ పోనగంటి విష్ణువర్ధన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన పేదలు ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం తన అధికారిక సర్క్యులర్ లో స్పష్టం చేసిందన్నారు. 57 ఏళ్లు నిండిన వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, కల్లుగీత, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులు ఈ పథకానికి అర్హులని తెలిపారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అర్హులైన వారు వెంటనే మీ-సేవ, ఈ-సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్, బర్త్ లేదా స్టడీ సర్టిఫికెట్, ఫోటో తీసుకెళ్లాలని చెప్పారు. ఒక ఇంటిలో 57 సంవత్సరాలు నిండిన వారు ఇద్దరు ఉంటే అందులో ఒక్కరే పెన్షన్ కు దరఖాస్తు చేసుకోవాలని, ఒక ఇంటి నుంచి ఇద్దరు దరఖాస్తు చేసుకుంటే పరిశీలనలో ఒకటి తొలగించబడుతుందని ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. కాబట్టి అర్హులైన లబ్ధిదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నేడే దరఖాస్తు చేసుకోవాలని కౌన్సిలర్ పోనగంటి విష్ణువర్ధన్ కోరారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :