D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : .. ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ జనవరి 13 వైరా (అక్షరం న్యూస్) వైరా స్థానిక ఠాగూర్ విద్యా సంస్థలైన శ్రీ క్రాంతి జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా విద్యార్థుల కు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల చైర్మన్ వాసిరెడ్డి సునీత, డైరెక్టర్ సంక్రాంతి సంయోగిత మాట్లాడుతూ సంక్రాంతి పండుగ ను పురస్కరించుకొని మహిళలు వేసే ముగ్గులు భారతదేశ ఔన్నత్యాన్ని సంస్కృతిని సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయని, వాటికి కుల మత వర్ణ వర్గ బేధం ఉండదని అలా నిర్వహించుకునే పండుగ సంక్రాంతి పండుగ అని పేర్కొంటూ విద్యార్థులను అభినందించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతి ప్రధానోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల కరెస్పాండెంట్ సంక్రాంతి రవికుమార్, ఎన్ ఎస్ ఎస్ పీఓ లింగారావు ప్రిన్సిపల్ కృష్ణారావు, నాగలక్ష్మి, మజీద్, వేణు, అధ్యాపకులు విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily