GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపెల్లి/ గోదావరిఖని (జ్యోతి నగర్ ): : పెద్దపల్లి జిల్లా / జ్యోతి నగర్ ఎన్టిపిసి / సెప్టెంబర్ 21/ అక్షరం న్యూస్ - ఈనెల 25న జరిగే ఎన్టిపిసి రామగుండం గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో బిఎంఎస్ ను గెలిపించాలని బి ఎం ఎస్ జాతీయ ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎంబీసీ మెంబర్ సుంకరి మల్లేశం అన్నారు. శనివారం రాత్రి ఎన్ టి పి సి వెరిఫికేషన్ ఎన్నికల గేట్ మీటింగ్ సందర్భంగా మెయిన్ గేట్ వద్ద జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్టిపిసి ఉద్యోగులకు పిఆర్పి ఇవ్వాలని బిఎంఎస్ పట్టు పట్టగా ఐ ఎన్ టియు సి సహా ఇతర యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకించాయని, సంతకాల సేకరణ కూడా చేపట్టారని ఆయన అన్నారు. పిఆర్పీ వల్ల అన్యాయం జరుగుతుందని ప్రచారం చేశారని, ప్రతి దసరాకు 4000 ఎక్స్రేసియా పెరిగే పరిస్థితి నుంచి తాము సాధించిన పీఆర్పీ వల్ల ఈరోజు ఉద్యోగులు లక్షల రూపాయలు ప్రతి ఏటా దసరాకు తీసుకుంటున్నారని అన్నారు. ఇలాంటి దీర్ఘకాలికంగా లాభం జరిగే అంశాలపై బిఎంఎస్ పనిచేస్తుందని అన్నారు. ఉద్యోగాల నియామకం పూర్తిగా తగ్గిపోయి చేస్తున్న ఉద్యోగులపై భారం పడుతున్నదని, బి ఎం ఎస్ ను ఈసారి రెండు సీట్లు గెలిపిస్తే ఉద్యోగ నియామకాలు జరిగే విధంగా కృషి చేస్తామని అన్నారు. అదేవిధంగా ఫాస్ట్ ట్రాక్ ప్రమోషన్లు, పి ఆర్ఎస్ బెనిఫిట్స్ పెంచే విధంగా మాట్లాడుతామని అన్నారు. రామగుండం ఎన్టిపిసి లో బి ఎం ఎస్ కు నాయకత్వం లేదని ప్రచారం చేస్తున్నారని కానీ ఉన్న ప్రతి ఉద్యోగి మంచి నాయకుడే అని అన్నారు. అవినీతి చేస్తూ తప్పులు చేసే నాయకులు లీడర్షిప్ పేరుతో పైన చేసే నాయకులు బి ఎం ఎస్ లో ఉండరు అని అన్నారు. ఈ ఎన్నికలు రామగుండంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగడం లేదని ఉద్యోగులు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా బిఎంఎస్ ఓటు వేయాలని కోరారు. కేంద్ర ఇంటలిజెన్స్ నివేదిక కూడా రామగుండంలో బిఎంఎస్ గెలుస్తుందని వచ్చిందని అందుకే దుష్ప్రచారం మొదలైందని అన్నారు. ఈ గేట్ మీటింగ్ కు ఎన్టిపిసి కార్మిక సంఘం అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి స్వాగతం పలుకగా మహేష్ అధ్యక్షత వహించారు. ఎన్టిపిసి అడిషనల్ ఎన్బిసి మెంబర్ రామ్నాథ్ గణేషన్, సింగరేణి బిఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య ఎన్టిపిసి కాంటాక్ట్ వర్కర్స్ కార్మిక సంఘం అధ్యక్షులు బండారి కనుకయ్య రంజిత్ సాగర్ రాజు పోగుల స్వామి సత్యనారాయణ రెడ్డి రాములు ప్రసంగించారు. సమావేశానికి ముందు బిఎంఎస్ కార్యాలయం నుంచి పెద్ద ఎత్తున ర్యాలీగా గేట్ మీటింగ్ వరకు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
.
Aksharam Telugu Daily