D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ కల్లూరు/ఆగస్టు/17 ఖమ్మం జిల్లా కల్లూరు లోని ఆశ్రమ పాఠశాలలో మరోసారి విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం జీరా రైస్ తిన్న 12 మంది విద్యార్థినిలు ఒక్కసారిగా కడుపులో నొప్పి,విరోచనాలతో బాధపడుతూ ఉండటంతో వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. అయితే 15 రోజుల వ్యవధిలో మూడుసార్లు 50 మందికి పైగా విద్యార్థినిలు అస్వస్థకు గురికావడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల ఐదవ తేదీన ఆశ్రమ హాస్టల్ లో అల్పాహారం తిన్న 37 మంది విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. తరువాత రోజు పదిమంది విద్యార్థినిలు అస్వస్థత గురయ్యారు.ఈ ఘటనకు సంబంధించి ఐటీడీఏ పీవో సదరు హాస్టల్ వార్డెన్ ను సస్పెండ్ చేశారు.ఘటన జరిగిన 12 రోజులు గడవక ముందే మరోసారి పాఠశాలలోని విద్యార్థులు అస్వస్థతకు గురికావడం ఆందోళన కలిగిస్తుంది. స్థానిక ఎమ్మెల్యే రాగమయి, అడిషనల్ కలెక్టర్ అజయ్ యాదవ్ తదితర ఉన్నతాధికారులు హాస్టల్ ను పరిశీలించి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశించారు. అధికారుల ఆదేశాలను సైతం హాస్టల్ సిబ్బంది పట్టించుకోకపోవడం వలన మరోసారి విద్యార్థిని లు అనారోగ్యానికి గురయ్యారని విద్యార్థినిల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్యానికి గురైన విద్యార్థులను సందర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యురాలు భూక్యా జ్యోతి, తాసిల్దార్ పులి సాంబశివుడు, ఏఎంసీ చైర్మన్ భాగం నీరజా దేవి, హెచ్ఎం శ్రీనివాసరావు తదితరులున్నారు.
.
Aksharam Telugu Daily