GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - జాతీయ వార్తలు / : - 2014-15 నుండి భారతదేశం పెట్రోల్ ప్రత్యామ్నాయం ఇతనాల్ ద్వారా రూ.1.40 లక్షల కోట్లకు పైగా విదేశీ మారక ద్రవ్యం ఆదా ఏప్రిల్ 1 నుంచి పెట్రోల్ పంపుల్లో కొత్త రూల్ ఫిబ్రవరి 17న కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌లో 'బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో చమురు కంపెనీలు 20 శాతం వరకు ఇథనాల్-బ్లెండెడ్ మోటార్ స్పిరిట్(పెట్రోల్)ను విక్రయించాలి. మినిమం రిసెర్చ్ ఆక్టేన్ నెంబర్ (RON) 95 కలిగిన పెట్రోల్ ఉండాలి.' అని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ప్రత్యేక పరిస్థితులలో నిర్దిష్ట ప్రాంతాలకు, అంతేకాకుండా పరిమిత సమయం వరకు కేంద్ర ప్రభుత్వం మినహాయింపులను అనుమతించేందుకు అవకాశం ఉంది. ఇథనాల్‌ను చెరకు, మొక్కజొన్న లేదా ఇతర ధాన్యం నుండి తయారు చేస్తారు. ఇది పునరుత్పాదకమైనది, దేశీయంగా ఉత్పత్తి చేయవచ్చు. పెట్రోల్ కంటే ఇది తక్కువ కాలుష్యానికి కారణం అవుతుంది. చమురు దిగుమతులను తగ్గించడంలో సహాయపడటానికి, కాలుష్య ఉద్గారాలను తగ్గించడానికి ప్రభుత్వం ఇథనాల్‌ను తప్పనిసరి చేసింది. ఈ నిర్ణయం రైతులకు కూడా మేలు చేయనుంది. 2023-2025 నుండి భారతదేశంలో తయారయ్యే చాలా వాహనాలు ఈ20 ఆధారంగా నడిచేలా రూపొందించారు. పెద్ద సమస్యలు ఏవీ ఉండవని అధికారులు చెబుతున్నారు. అయితే పాత వాహనాల మైలేజీలో స్వల్పంగా తగ్గుదల ఉండే అవకాశం ఉంది. అందులో భాగంగానే.. ఇంజిన్ దెబ్బతినకుండా ఉండేందుకు కనీసం RON 95 కలపాలని కేంద్రం నిబంధన విధించింది. మినిమం రీసెర్చ్ ఆక్టేన్ నంబర్(RON) ఇంజిన్ నాకింగ్ (ప్రీ-ఇగ్నిషన్)కు ఇంధనంతో ఎంతవరకు తట్టుకుంటుందో తెలియజేస్తుంది. ఇంజిన్ లోపల ఇంధనం అసమానంగా మండినప్పుడు నాకింగ్ జరుగుతుంది. RON ఎంత ఎక్కువగా ఉంటే ఇంధనం నాక్ చేయడానికి అంత ఎక్కువ నిరోధకతను కలిగి ఉంటుంది. అంటే అధిక ఒత్తిడిలోనూ ఇంధనం స్థిరంగా ఉంటుంది. ఇథనాల్ సహజంగానే అధిక ఆక్టేన్ విలువను కలిగి ఉంటుంది. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను కలపడం వల్ల నాకింగ్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. జూన్ 2022లో భారతదేశం పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్ బ్లెండింగ్ సాధించాలని టార్గెట్ పెట్టుకుంది. అయితే అనుకున్నదానికంటే ఐదు నెలల ముందుగానే ఈ లక్ష్యాన్ని చేరుకుంది. దీనితో ప్రభుత్వం 2030 నుండి 2026కి 20 శాతం బ్లెండింగ్ టార్గెట్‌ను సెట్ చేసింది. దేశంలోని చాలా పెట్రోల్ పంపులు ఇప్పుడు ఈ20 లేదా 20 శాతం ఇథనాల్‌తో కలిపిన పెట్రోల్‌ను విక్రయిస్తున్నాయి. కేంద్రం ప్రకారం, 2014-15 నుండి భారతదేశం పెట్రోల్ ప్రత్యామ్నాయం ద్వారా రూ.1.40 లక్షల కోట్లకు పైగా విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేసింది.
.
Aksharam Telugu Daily