Wednesday, 04 March 2026 01:42:40 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

పార్టీ అభివృద్ధికి నిరంతరం కష్ట పడతా. గాంధీభవన్ లో టీపీసీసీ జనరల్ సెక్రటరీ గా నియామక పత్రం అందుకున్న నాగా సీతారాములు.

.


MD NASEER MIYA , CRIME REPORTER, BHADRADRI KOTHAGUDEM.

Reporter

Date : 25 June 2025 07:08 PM Views : 753

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ కొత్తగూడెం/ 25 జూన్/ అక్షరం న్యూస్: హైదరాబాద్ గాంధీ భవన్ లో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన టీపీసీసీ కార్యవర్గ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ భట్టి విక్రమార్క ఇటీవల నియమితులైన టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు తనపై నమ్మకంతో పార్టీ ఇచ్చిన బాధ్యతను తూచా తప్పకుండా పాటిస్తూ పార్టీ విధి విధానాలకు కట్టుబడి ఉంటానన్నారు. పార్టీ బలోపేతానికి అందరినీ కలుపుకుని సమిష్టిగా ముందుకు వెళ్తానని, కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు వస్తుంది అని చెప్పడానికి తానే నిదర్శనమన్నారు. స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుండి మొదలై మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల వరకు ఎన్నో ఒడిదుడుకులు, ఒత్తిళ్ళు, అవమానాలు, అరెస్టులు, ఉద్యమాలు అన్ని చూసుకుంటా కేవలం పార్టీ బలోపేతం, కార్యకర్తల సంక్షేమం కోసం గత 3 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ లోనే కొనసాగిన తనకు గతంలో టీపీసీసీ మెంబెర్ గా ఇప్పుడు టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ అవకాశం ఇచ్చిందన్నారు. ఎమ్మెల్యే, ఎంపి, ఎమ్మెల్సీ ఆశావాహుడిగా ఉండి తనకు టికెట్ దక్కనప్పటికి అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు ఎన్నికల్లో పార్టీ లైన్ దాటకుండ ప్రచారం చేసిన వ్యక్తిత్వం తనదన్నారు. కష్టపడి పని చేస్తే అధిష్టానం గుర్తుంచి సముచిత స్థానం కల్పిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ మహా వృక్షమని, ఆ నీడలో అందరం కలిసి సమిష్టిగా పని చేస్తామని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం నిరంతరం కృషి చేస్తామన్నారు. తనపై నమ్మకంతో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి భాద్యతలు అప్పగించిన జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, చైర్ పర్సన్ సోనియా గాంధీ, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ,టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ ఇంచార్జి మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,తుమ్మల నాగేశ్వరావు పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘు రాంరెడ్డి , రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి లకు నాగా సీతారాములు కృతజ్ఞతలు తెలిపారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :