D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం : * * *ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ జూన్ 11/ వైరా (అక్షరంన్యూస్)* ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో వైరా డివిజన్ పరిధిలో ఉన్న అన్ని ప్రైవేట్ స్కూళ్లలో, కళాశాలల్లో బస్సుల్లో ఫిట్నెస్ తప్పనిసరిగా కలిగి ఉండాలని వైరా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్ సూచించారు. బుధవారం ఆయన వైరాలో తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ బస్సులు కండిషన్ లో లేకుండా నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వైరా డివిజన్ పరిధిలోని వైరా, తల్లాడ, కొనిజర్ల, బోనకల్లు, మధిర, ఎరుపాలెం మండలాల్లో ప్రైవేట్ స్కూల్లో, కళాశాలలో బస్సులు కండిషన్ లో ఉండే విధంగా యాజమాన్యం చర్యలు తీసుకోవాలని సూచించారు. వాహనాల్లో విద్యార్థులకు సీట్ల సౌకర్యం ఉండాలని, ఆర్టిఏ అధికారుల నుండి పూర్తి ఫిట్నెస్ తో కూడిన సర్టిఫికెట్ వచ్చిన తర్వాతనే బస్సులను బయటకు తీయాలన్నారు. వాహనాల్లో విద్యార్థులను ఎక్కువగా ఎక్కించకూడదని, బస్సు డోర్ దగ్గర తప్పనిసరిగా ఓ వ్యక్తిని ఉంచాలని సూచించారు. బస్సులకు సంబంధించిన అన్ని పత్రాలు, డ్రైవర్లకు లైసెన్సులు ఉండాలని తెలిపారు. అనుభవం కలిగిన డ్రైవర్లను పెట్టుకోవాలని, సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండే విధంగా చూసుకోవాలని తెలిపారు. 60 ఏళ్ల లోపు వయసున్న డ్రైవర్లను పెట్టుకోవాలని వెల్లడించారు. ఎవరు నిబంధనలు అతిక్రయించిన ఆ వాహనాలను సీజ్ చేయటం జరుగుతుందని హెచ్చరించారు.
.
Aksharam Telugu Daily