Monday, 15 December 2025 07:16:54 AM
 Breaking
     -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

విజయవంతంగా 11వ జోనల్ స్థాయి క్రీడా పోటీలు.. విద్యార్థులు లక్ష్య సాధనలో కృషి, నిబద్ధత, పట్టుదల ఎంతో ముఖ్యం... అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 08 November 2025 08:39 PM Views : 254

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం స్టాఫ్ రిపోర్టర్/వైరా /నవంబర్ 8 (అక్షరంన్యూస్) 11వ జోనల్ స్థాయి క్రీడా పోటీలు వైరా స్థానిక టి.జి.ఎస్.డబ్ల్యు.ఆర్.ఎస్. జూనియర్ కళాశాల (బాలికలు) లో ఘనంగా నిర్వహించబడ్డాయి. శనివారం ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ విద్యార్థుల సమగ్ర అభివృద్ధిలో క్రీడలు, ఆటల ప్రాముఖ్యతను వివరించారు. విజయం సాధించాలనే ప్రయత్నం చేయాలని, అపజయంలోనూ ధైర్యంగా ఉండాలని, జీవితంలో ధైర్యం ఎప్పుడూ వదిలి పెట్టకూడదని విద్యార్థులకు సూచించారు. లక్ష్య సాధనలో కృషి, నిబద్ధత, పట్టుదల ఎంతో ముఖ్యమని వివరించారు. ఈ సందర్భంగా అండర్-14, 17, 19 విభాగాల్లో గెలిచిన విజేతలకు, రన్నర్‌ అప్స్‌కు బహుమతుల ప్రదానం చేశారు. ప్రతి విద్యార్థి భాగస్వామ్యానికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ప్రిన్సిపల్, ఫిజికల్ డైరెక్టర్, పి.ఈ.టి. లను, స్కూల్ టీమ్ కృషిని అదనపు కలెక్టర్ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మల్టీ జోనల్ అధికారి కె.అలివేలు, డిసిఓ ఎం. రాజ్యలక్ష్మీ, స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ డి. సమత, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :