GUDIKANDULA DASU , MANDAL REPORTER, CHIGURUMAMIDI, KARIMNAGAR. Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్ / చిగురు మామిడి : సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని, ప్రజా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లడంలో జర్నలిస్టుల నిరంతర శ్రమ ప్రశంస నీయమైనదని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఇటీవలే ఎన్నికైన బిఎంఎస్ అనుబంధ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా కరీంనగర్ జిల్లా శాఖ నూతన కార్యవర్గాన్ని ఆయన అభినందించారు. కార్యవర్గ సభ్యులందరినీ శాలువాలతో సత్కరించారు.డబ్ల్యూజేఐ జిల్లా అధ్యక్షుడు దారం జగన్నాథరెడ్డి ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ సభ్యులు బుధవారం కేంద్ర మంత్రిని ఆయన నివాస గృహంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్తంభమైన మీడియా నిజాలను నిర్భయంగా వెలికి తీయాలని, పూర్తి స్వతంత్రతతో పనిచేయాలని అన్నారు. జర్నలిస్టులు సమాజంలో నెలకొన్న సమస్యలను వెలికి తీసి సమాజాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. అనంతరం జిల్లా నూతన కార్యవర్గాన్ని కేంద్రమంత్రికి డబ్ల్యూజెఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు టి సత్యనారాయణ పరిచయం చేశారు.అధ్యక్షుడు దారం జగన్నాథరెడ్డి, ఉపాధ్యక్షులుగా మొగురం రమేష్,నర్సరీ కేదారి,ప్రధాన కార్యదర్శి గుడాల శ్రీనివాస్ , మహిళ కార్యదర్శి లావణ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శులు రవీందర్, జి రమేష్, సంయుక్త కార్యదర్శి బూర్ల వెంకటేష్, కోశాధికారి చిటుమల్ల మహేందర్ కార్యవర్గ సభ్యులు జి రామకృష్ణ, కంది శ్రీనివాసరెడ్డి, పి సంతోష్ గౌడ్,జాలి నరేష్, కస్తూరి ప్రభాకర్, గంగం రాజు, కే రవీంద్ర చారి,సిహెచ్ వెంకటేష్, కే కుమార్, గుడికందుల దాసు తదితరులను కేంద్రమంత్రి ఘనంగా సన్మానించారు.
.
Aksharam Telugu Daily