AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/చొప్పదండి : చొప్పదండి /కరీంనగర్,నవంబర్ 13( అక్షరం న్యూస్ ) చొప్పదండి మునిసిపాలిటీ పరిధి 11వార్డులో నివాసముంటున్న మునిగంటి మల్లేశం 65( సం.)మృతి చెందగా వారు పేదవారు కావున కుటుంబ సభ్యులు అతని అంతిమ సంస్కారాల ఆర్థిక సహాయం కొరకు రామకృష్ణ సేవాసమితి చొప్పదండి సంస్థను సంప్రదించగా దాత కొల్లూరి జితేందర్ స్పందించి వారి తండ్రి సేవాసమితి ప్రధాన సలహాదారు కొల్లూరి ఆనందం చేతుల మీదుగా అంతిమ సంస్కారాలకు 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా కార్యదర్శి పెరుమండ్ల గంగయ్య, చొప్పదండి మున్సిపాలిటీ 11 వార్డు సభ్యులు పిట్టల వెంకటేష్ గారి సమక్షంలో వారి కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ సేవాసమితి అధ్యక్షులు కొక్కుల కనకయ్య,సేవాసమితి సభ్యులు పడకంటి కృష్ణ మొదలగునవారు పాల్గొన్నారు. వారి కుటుంబ సభ్యులు కొల్లూరి జితేందర్ కి, రామకృష్ణ సేవాసమితి సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
.
Aksharam Telugu Daily