AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ ఆగష్టు 22 అక్షరం న్యూస్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఈ నెల 24, 25 తేదీల్లో జార్జిరెడ్డి పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు నరేష్‌రత్న పిలుపునిచ్చారు. శనివారం పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో శిక్షణ తరగతులకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నరేష్‌రత్న మాట్లాడుతూ విద్యార్థులు, యువత రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిణామాలను శాస్త్రీయ దృక్పథంతో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యారంగంలో ప్రైవేటీకరణ, ఫీజుల భారం, నిరుద్యోగం, సామాజిక అసమానతలు తదితర సమస్యలపై అవగాహన పెంపొందించుకోవడానికి శిక్షణ తరగతులు దోహదపడతాయని తెలిపారు. విద్యార్థి, ప్రజా ఉద్యమాల చరిత్ర, విద్యార్థుల హక్కులు, సామాజిక బాధ్యత తదితర అంశాలపై శిక్షణ తరగతుల్లో చర్చలు జరుగుతాయని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ సభ్యులు రమ్య, శిరీష, స్వప్న, వాసవి, కోమల, సౌజన్య, తిరుమల, సుకన్య, నవ్య, క్రాంతి, బేగం, సల్మా తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily