AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం / కొత్తగూడెం / సెప్టెంబర్ 19 / అక్షరం న్యూస్ -: ఫెడరేషన్ ఆఫ్ లీగల్ ప్రొఫెషనల్స్ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌గా కొత్తగూడెం జిల్లా బార్ అసోసియేషన్‌కు చెందిన అడ్వకేట్ ఇంతియాజ్ పాషా నియమితులైనట్లు అధ్యక్షుడు దిలీప్ చౌదరి తాళ్లూరి ప్రకటించారు. ఈ నియామకంతో సంస్థ మరింత బలపడుతుందని, తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల సంక్షేమం కోసం ఆయన కృషి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ నియామకంపై సంతోషం వ్యక్తం చేసిన ఇంతియాజ్ పాషా, తెలంగాణ న్యాయవాదుల సమస్యలను రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి, న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తానని తెలిపారు.
.
Aksharam Telugu Daily