GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLAReporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /మార్చి -30(అక్షరం న్యూస్ ) ముస్తాబాద్ మండల పరిధిలో ని గ్రామాలలో మీ ఇంట్లో, గ్రామం లో ఉన్న ఆలయాల్లో దొంగలు పడకుండా నిరోధించేందుకు యాంటీ థెఫ్ట్ అలారం తాళాలు వేయాలని ముస్తాబాద్ ఎస్ ఐ గణేష్ సూచించారు. సోమవారం ముస్తాబాద్ మండలం తెర్లు మద్ది గ్రామం లో గ్రామ సర్పంచ్ బైతి దుర్గమ్మ -నవీన్ గ్రామం లో ఉన్న 8 ఇతర, కుల. సంఘాల దేవాలయాలకు సర్పంచ్ స్వంత నిధుల తో ఒక్కొకటి రూ. 800రూపాయల విలువ గల స్మార్ట్ యాంటీ థెఫ్ట్ అలారం తాళాల ఏర్పాటు చేయడం తో వాటిని ఎస్ ఐ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎస్ ఐ మాట్లాడుతూ గ్రామాలలో ఇంటి తలుపులు,ఆలయలకు, కిటికీలకు స్మార్ట్ యాంటీ థెఫ్ట్ అలారం తాళం వేస్తే చాలు దొంగలు వాటిని తెరిచేందుకు యత్నిస్తే మాగ్నటిక్ సెన్సార్ల సహాయంతో అలారం మోగుతుందని, దొంగలు ఈ తాళాన్ని పగుల గొట్టేందుకు యత్నిస్తే 105 నుంచి 110 డెసిబుల్ శబ్దాలతో అలారం మోగిస్తూ నివాసితులతోపాటు చుట్టుపక్కల గృహాల వారిని అప్రమత్తం చేస్తుంది.అని తెలిపారు ఈ అధునాతన తాళాల సహాయంతో దొంగతనాలను నియంత్రించవచ్చని తెలిపారు.ఆస్తి నేరాలు జరగకుండా అందరూ అలారం తాళం ఏర్పాటు pచేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామస్తులు సర్పంచ్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ ఐ తో పాటు గ్రామ సర్పంచ్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily