AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ ములకలపల్లి/ సెప్టెంబర్ 14/ అక్షరం న్యూస్: ములకలపల్లి మండలం మూకమామిడి ప్రాజెక్టు వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లను ములకలపల్లి మండల ఎస్సై *మధు ప్రసాద్,స్థానిక సర్పంచ్ కోర్సా ఆదిలక్ష్మి* సోమవారం పరిశీలించారు.ప్రతి ఏటా వినాయక చవితి సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుండి అనేక వినాయక విగ్రహాలను మూకమామిడి ప్రాజెక్టులో నిమజ్జనం చేస్తారు.ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.ఈ సందర్భంగా ఎస్సై మధు ప్రసాద్ ప్రాజెక్టు వద్దకు వచ్చి నిమజ్జనం కోసం చేస్తున్న ఏర్పాట్లను స్థానిక సర్పంచ్ కోర్సా ఆదిలక్ష్మి గారిని అడిగి తెలుసుకున్నారు.నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని,భద్రతా చర్యలు పకడ్బందీగా చేపట్టాలని సూచించారు.ప్రాజెక్టులో నీటి లోతు,రాకపోకలకు రోడ్డు మార్గం,పోలీసు బందోబస్తు,క్రేన్,లైటింగ్ సౌకర్యాలపై సర్పంచ్ తో చర్చించారు.భక్తులు జాగ్రత్తగా నిమజ్జనం చేసుకునేలా బారికేడ్లు,గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు.ఈ పరిశీలనలో సర్పంచ్ ఆదిలక్ష్మి తో పాటు మూకమామిడి ప్రాజెక్టు కమిటీ ముత్యం.భిక్షం,పోడియం.ప్రేమ్ కుమార్,రింగు.బాలకృష్ణ,భాణోత్.మహేష్,వేముల.వెంకటరావు,గుగులోత్.వినయ్,భూక్యా.గణేష్,భూక్యా.వెంకటేష్,బత్తుల.వెంకటేష్ గడ్డం.వెంకటేష్,గూగులోత్.అనిల్ గుగులోత్.రవి మరియు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు,పోలీసు సిబ్బంది,గ్రామస్తులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily