AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ నవంబర్ 21 అక్షరం న్యూస్ పెద్దపల్లి పట్టణంలో ప్రభుత్వ ఐటిఐ గ్రౌండ్ లో అభివృద్ధి పనులను పరిశీలించి, వాకింగ్ ట్రాక్, లైటింగ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులకు పలు సూచనలు చేసారు ప్రభుత్వ విప్,పెద్దపల్లి విజయరమణరావు ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలోని జెండా చౌరస్తా వద్ద జరుగుతున్న ప్రధాన రోడ్డు విస్తరణ పనులను పరిశీలించడంతో పాటు జెండా చౌరస్తాలో ఏర్పాటు చేసే భారీ జాతీయ జెండా స్థలాన్ని పరిశీలించి అభివృద్ధిలో భాగంగా తొలగించిన పాత కమాన్ ప్రాంతంలో త్వరలో నూతన హంగులతో కమాన్ నిర్మాణం చేస్తామని ప్రభుత్వ విప్ విజయరమణ రావు తెలిపారు. పెద్దపల్లి మండలం నిట్టూరు, నిమ్మనపల్లి గ్రామాల్లో సింగిల్ విండో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్, కమిషనర్, పట్టణ కౌన్సిలర్లు, సింగిల్ విండో చైర్మన్, డైరెక్టర్లు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు మరియు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily