AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ ఆగష్టు 17 అక్షరం న్యూస్ పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక భరోసా కల్పించే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలని, అర్హులైన వృద్ధులకు పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ బిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం జరిగిన ఈ ధర్నాలో టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుపై ప్రభుత్వం తక్షణమే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా మౌనం వీడి వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని కోరారు. పేద కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించే ఈ పథకాలలో జాప్యం కారణంగా అర్హులైన కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించి ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే అర్హత ఉన్న వృద్ధులకు పెన్షన్లు మంజూరు చేయడంతో పాటు పెండింగ్‌లో ఉన్న పెన్షన్ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. కేసీఆర్ ప్రభుత్వం పేదలు, బడుగు, బలహీన వర్గాల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఆరోపించారు. ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలులో జాప్యం చేస్తూ పేదలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌పై హైకోర్టులో వెంటనే కౌంటర్ దాఖలు చేయాలి. పెండింగ్‌లో ఉన్న లబ్ధిదారులకు ఆర్థిక సాయం విడుదల చేయాలి. అర్హులైన వృద్ధులకు పెన్షన్లు, పెండింగ్ నిధులు వెంటనే మంజూరు చేయాలి అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ధర్నా అనంతరం మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై నెలకొన్న సందిగ్ధతకు ప్రభుత్వం వెంటనే తెరదించాలని, పెండింగ్‌లో ఉన్న అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు భరోసా కల్పించే పథకాలపై మౌనం ఎందుకు? వృద్ధుల పెన్షన్ల విషయంలో జాప్యం ఎందుకు?” అంటూ టీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పేదలు, వృద్ధులకు న్యాయం జరిగే వరకు ప్రజా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని దాసరి మనోహర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలు, వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, బిఆర్‌ఎస్ పెద్దపల్లి పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్‌కుమార్, మార్కు లక్ష్మణ్, కొయ్యడ సతీష్, పెంచాల శ్రీధర్, విక్రం తదితర నాయకులు, బిఆర్‌ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily