Saturday, 18 April 2026 12:30:52 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

_2 కోట్ల నగదు, ఖరీదైన ఓపెన్​ ప్లాట్లు - విద్యుత్‌శాఖ ఏడీఈని అరెస్టు చేసిన ఏసీబీ_*


GUDIKANDULA DASU , MANDAL REPORTER, CHIGURUMAMIDI, KARIMNAGAR.

Reporter

Date : 16 September 2025 07:37 PM Views : 541

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్ / చిగురు మామిడి : * కరీంనగర్ /చిగురుమామిడి సెప్టెంబర్ 16 (అక్షరం న్యూస్ ) *_ విద్యుత్‌శాఖ ఏడీఈ అంబేడ్కర్‌ ఇళ్లలో ఏసీబీ తనిఖీలు_* *_అంబేడ్కర్‌ ఇళ్లు, ఆయన బంధువులు, కుటుంబసభ్యుల ఇళ్లలో సోదాలు - అరెస్ట్ చేసిన ఏసీబీ - రిమాండ్‌ విధించిన కోర్టు_* అవినీతి నిరోధక శాఖ వలకు మంగళవారం భారీ తిమింగళం చిక్కింది. హైదరాబాద్‌లో విద్యుత్‌శాఖ ఏడీఈ అంబేడ్కర్​ను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అరెస్టు చేసింది. వైద్య పరీక్షల అనంతరం రిమాండ్‌కు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. శేరిలింగంపల్లిలో ఇళ్లు, గచ్చిబౌలిలో 5 అంతస్తుల భవనం, హైదరాబాద్‌లోని ప్రధాన ప్రాంతాల్లో 6 ఇళ్లు, ఓపెన్ ప్లాట్లు, 2 కార్లు, బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లు, వ్యవసాయ భూములను గుర్తించారు. తెలంగాణ విద్యుత్‌ శాఖలో ఏడీఈ అంబేడ్కర్‌ బంధువు సతీష్‌ నివాసంలో ఇంట్లో ఏసీబీ అధికారులు రూ.2 కోట్ల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఏడీఈగా పనిచేస్తున్న అంబేడ్కర్​పై ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. అంబేడ్కర్​ కొండాపూర్‌లోని మేఘన లేక్‌ వ్యూ అపార్ట్‌మెంట్‌లోని మూడో అంతస్తులో ఉంటున్నాడు. ఈయనపై అనేక అవినీతి ఆరోపణలున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. తమకు అందిన ఫిర్యాదులతో రంగంలోకి దిగిన ఏసీబీ కేసు నమోదు చేసి సోదాలు చేపట్టింది. *_వందల కోట్లు కూడబెట్టారని ఫిర్యాదులు_* ఏడీఈ అంబేడ్కర్‌ భారీగానే వందల కోట్ల ఆస్తులు కూడగట్టినట్లు ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ఇబ్రహీంబాగ్‌ ఏడీఈగా పనిచేస్తున్న అంబేద్కర్ నివాసంలో ఉదయం నుంచి ఏసీబీ సోదాలు కొనసాగాయి. ప్రధానంగా అవినీతి, ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై ఈ సోదాలు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మెదక్ జిల్లాల్లోని ఆయన బంధువులు, కుటుంబసభ్యులు, స్నేహితుల నివాసాల్లో మొత్తం 12 చోట్ల సోదాలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. గచ్చిబౌలిలో ఖరీదైన భవనం : హైదరాబాద్​లో ప్రధాన ప్రాంతాల్లో 6 ఇళ్లు, 3 ప్లాట్లు, గచ్చిబౌలిలో ఖరీదైన భవనం, సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌లో 10 ఎకరాల వ్యవసాయ భూమి, 2 కార్లు, బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లు, హైదరాబాద్​ శివారులో వెయ్యి గజాల్లో వ్యవసాయ క్షేత్రం (ఫార్మ్​హౌస్​) గుర్తించినట్లు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ ఈటీవీ భారత్​కు తెలిపారు. రాత్రి వరకూ సోదాలు : ఈ సోదాల్లో మరిన్ని ఆస్తులకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తామని అధికారులు చెప్పారు. ఏసీబీ అంబేడ్కర్‌ ఇళ్లు, ఆయన బంధువులు, కుటుంబసభ్యుల ఇళ్లలో మమ్మరంగా సోదాలు చేసింది. అయితే విద్యుత్‌ శాఖలో అవినీతి అధికారి వ్యవహారం బట్టబయలు కావడంతో ఈ అంశం చర్చనీయాంశమైంది. అంబేడ్కర్​ ఆస్తులపై సోదాలు ముగిసిన అనంతరం ఆయనను అరెస్టు చేసింది. కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించింది. "విద్యుత్​ శాఖ ఏడీఈ అంబేడ్కర్​ గారిపై అవినీతి ఆరోపణలు రావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. దానిలో భాగంగా వారి ఇంట్లో సోదాలు జరుపుతున్నాం. అంతేకాకుండా ఆయన సన్నిహితులు, అవినీతిలో సహకరించిన వారి ఇళ్లలోనూ ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నాం. 12 చోట్ల ఏకకాలంలో దాడులు జరగుతున్నాయి. హైదరాబాద్​, రంగారెడ్డి, మెదక్​, సూర్యాపేట జిల్లాల్లో సోదాలు చేస్తున్నాం. చేయకూడని పనులు చేస్తూ, అడ్డగోలుగా అనుమతులు ఇస్తూ అవినీతి చేసి కోట్లు సంపాదించినట్లు మాకు సమాచారం ఉంది. దాంతో మేము సోదాలు చేస్తున్నాం. గచ్చిబౌలిలో ఖరీదైన 5 అంతస్థుల భవనం, 3 ప్లాట్లు, వెయ్యి గజాలలో ఓ ఫార్మ్​హౌజ్​, 10 ఎకరాల వ్యవసాయ భూములను గుర్తించాం" -ఆనంద్​, ఏసీబీ డీఎస్పీ *లంచం తీసుకుంటే దొరికిపోతారు జాగ్రత్త! - తెలంగాణలో దూకుడు పెంచిన ఏసీబీ*

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :