Tuesday, 28 July 2026 02:47:41 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

పొరపాట్లకు తావులేకుండా ఎస్‌ఐఆర్ పూర్తి చేయాలి ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 27 July 2026 06:09 PM Views : 22

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ జూలై 27 అక్షరం న్యూస్ ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకతతో, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పూర్తి చేయాలని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అధికారులను ఆదేశించారు. సోమవారం పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సమావేశానికి ముందు మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం పట్టణ అభివృద్ధి, మౌలిక సదుపాయాలకు సంబంధించిన 39 అజెండా అంశాలను చర్చించి కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఆమోదించారు. సమావేశం అనంతరం కౌన్సిలర్లు, వార్డు అధికారులు, బీఎల్‌వోలు, మెప్మా రిసోర్స్ పర్సన్లతో ఎస్‌ఐఆర్ కార్యక్రమంపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. పట్టణంలోని 36 వార్డుల్లో ఓటరు జాబితా ప్రత్యేక సవరణను సమన్వయంతో పూర్తి చేయాలని, అవసరమైతే ప్రతి వార్డులో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసి ప్రజల దరఖాస్తులను సకాలంలో పరిశీలించాలని సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, వైస్ చైర్‌పర్సన్ ముస్కాన్ నాజ్ నయ్యర్ అలీ, టౌన్ ప్లానింగ్ అధికారులు, కౌన్సిలర్లు, వార్డు అధికారులు, బీఎల్‌వోలు, మెప్మా రిసోర్స్ పర్సన్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :