Saturday, 18 April 2026 06:42:02 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి :: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

ప్రభుత్వ విద్యా సంస్థల్లో వెంటనే గ్యాస్ స్టవు లు ఏర్పాటు చేసుకోవాలి* ముస్తాబాద్ మండల కేంద్రంలో జడ్పీహెచ్ఎస్,ప్రైమరీ స్కూల్, అంగన్వాడి కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్*


GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLA

Reporter

Date : 30 July 2025 03:11 PM Views : 740

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల/ముస్తాబాద్,/ జూలై 30:(అక్షరం న్యూస్) పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, ముస్తాబాద్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రైమరీ స్కూల్, అంగన్వాడీ కేంద్రాలను ఆదర్శంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని తరగతి గదులు,మధ్యాహ్న భోజనం వండే వంట గదులు, స్టోర్ రూమ్ లను స్వయంగా తిరిగి పరిశీలించారు.ప్రైమరీ స్కూల్ లోని విద్యార్థుల హాజరు వివరాలు స్వయంగా పరిశీలించి అటెండెన్స్ తీసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ,* పాఠశాలలో ఇంటర్నెట్ కనెక్షన్ ఏర్పాటు చేయాలని తద్వారా అన్ అకాడమీ క్లాసులు ప్రారంభించడానికి వీలుగా ఉంటుందని తెలిపారు. పాఠశాలలో నిరుపయోగంగా ఉన్న బెంచీ లను ఇతర పాఠశాలలకు, నిరుపయోగంగా ఉంచిన కుట్టు మిషన్ లను కలెక్టరేట్ కు తరలించాలని ఆదేశించారు. పాఠశాల ఆవరణలో గల ప్లే గ్రౌండ్ కు సిమెంట్ ఫ్లోరింగ్ చేయించాలని, విద్యార్డులు భోజనం చేయడానికి డైనింగ్ రూమ్ లో బెంచీలు ఏర్పాటు చేయాలని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సమర్పిస్తే అవసరమైన నిధులు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. స్కూల్ డ్రైనేజీ పైప్ లైన్ మరమ్మత్తు చేయించాలని పేర్కొన్నారు. ప్రైమరీ పాఠశాలలో అంగన్వాడీ సెంటర్లలో గోడలకు వైట్ వాష్ చేయాలని కలెక్టర్ పంచాయతి సెక్రటరీని అదేవిదంగా అంగన్వాడి సెంటర్లో లైటింగ్ సరిగా లేనందున వెంటనే ట్యూబ్ లైట్లు ఏర్పాటు చేయవలసిందిగా అధికారులను ఆదేశించారు. పాఠశాల ఆవరణలో గడ్డి మొక్కలు పిచ్చి మొక్కలు పెరగకుండా ఎప్పటికప్పుడు గ్రామ పంచాయతీ సిబ్బందితో శుభ్రం చేయాలని , అదే విధంగా మధ్యాహ్న భోజన పథకం లో భోజనం కట్టెల పై వుండకుండా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేశామని కావున వెంటనే గ్యాస్ స్టవ్ లను ఏర్పాటు చేసుకొని బిల్లులు కలెక్టరేట్ సమర్పించాలని హెడ్ మాస్టర్ కు తెలియజేశారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు,మండల విద్యాధికారి సంబంధిత అధికారులు, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :