GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLAReporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /జూన్ -19(అక్షరం న్యూస్ ) జిల్లా లొ ఇటీవల పానీపూరి తిని అస్వస్థతకు గురైన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ముస్తాబాద్ మండల కేంద్రం లోని వ్యాపార సముదాయాలను హోటళ్ళు, బేకరీ, వైన్స్ పర్మిట్ రూమ్,మెస్ లను స్థానిక తహసీల్దార్,ఎండీ, పారూక్, ఎంపీడీఓ లచ్చాలు, ఎంపీవో వాజీద్. పంచాయతీ కార్యదర్శి, పంచాయతి సిబ్బంది తో కలసి శుక్రవారం అకస్మిక తనిఖీ లు నిర్వహించారు.పరిశుభ్రత పాటించకుంటే చర్యలు తప్పవని ఆయా హోటళ్ల నిర్వాహకులను హెచ్చరించారు. పరిశుభ్రత విషయంలో మళ్లీ ఇలాగే జరిగితే జరిమానా విధించి హోటళ్లను సీజ్‌చేస్తామన్నారు.హోటల్స్ కిచెన్స్‌లో అధ్వానమైన పరిస్థితులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.వినియోగదారులకు హోటల్ యజమానులు నాణ్యతతో కూడిన ఆహరం అందించాలని సూచించారు.తనిఖీల్లో భాగంగా హోటల్‌లో పారిశుధ్య నిర్వహణ సరిగా లేదని, ఆహారపదార్థాల్లో నాణ్యతాప్రమాణాలు పాటించడం లేదని, ఆహార పదార్థాలకు సంబంధించిన ఐటమ్స్‌పై లేబుల్స్ లేకపోవడం, నిల్వ చేసే ప్రదేశంలో చెత్త ఉండటం వంటి అనేక లోపాలను గమనించినట్లు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంబందించిన హోటల్, వైన్స్ పర్మిట్, బేకరీ ల ఇతర నిర్వాహకులను సంజాయిషీ కోరుతూ షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని , సంజాయిషీ వచ్చిన తర్వాత తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. నాణ్యత ప్రమాణాలు పాటించని బేకరీ యజమానికి జరిమానా విధించారు ఈ తనిఖీ ల్లో తహసీల్దార్ ఎండీ ఫారుక్ ఎంపీడీఓ లచ్చాలు, ఎంపీవో వహీద్, పంచాయతీ కార్యదర్శి రమేష్,గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily