AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ సెప్టెంబర్ 06 అక్షరం న్యూస్ పద్మశాలి యువత రాజకీయాలలో రాణించాలని పెద్దపల్లి పద్మశాలి యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మేర్గు యాదగిరి, ప్రధాన కార్యదర్శి బోట్ల సాగర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు వేముల రామ్మూర్తి ఆదేశాల మేరకు ఆదివారం పెద్దపల్లి పట్టణ పద్మశాలి సంఘం కమ్యూనిటీ స్థలంలో సమావేశమూ ఏర్పాటు చేయగా జిల్లా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు కొలిపాక సత్తయ్య, పెద్దపల్లి పట్టణ అధ్యక్షుడు పులి శ్రీనివాస్, మండల అధ్యక్షుడు చిప్ప భాస్కర్, స్వతంత్ర కుమార్, వడ్డేపల్లి నరేందర్ సమక్షంలో పెద్దపల్లి పట్టణ యువజన కమిటీ సమావేశం నిర్వహించి పెద్దపల్లి పట్టణ నూతన కార్యవర్గాన్ని జిల్లా యువజన సంఘం ఆధ్వర్యంలో యువత అందరూ కలిసి ముక్తకంఠంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పెద్దపల్లి పట్టణ యువజన సంఘం అధ్యక్షుడిగా పులి రాజు, ప్రధాన కార్యదర్శిగా మోర హరేందర్, ఉపాధ్యక్షులుగా ఆల్లె శివకుమార్, గుండేటి గణేష్, చిప్ప నరసయ్య, మెరుగు నరేష్ , బంక రాజేష్, కోశాధికారిగా గుండేటి అరుణ్, కార్యదర్శిగా గాదాసు మధుకర్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా వేముల సందీప్, అడిచర్ల ఆంజనేయులు, మిట్టపల్లి అభిషేక్, కార్య వర్గ సభ్యులనులను యువత అందరు కలిసి ఏకాథాటిపై ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ గత పదేళ్లు పాలించిన టిఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుతం మూడేళ్లు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పద్మశాలి కమ్యూనిటీని పట్టించుకున్న దాఖలాలు లేవని అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో పెద్దపల్లి పద్మశాలి కమ్యూనిటీ కి ఇంతవరకు స్థలాన్ని కేటాయించలేదని పేర్కొన్నారు. ఎన్నికలలో హామీలు ఇచ్చి అనంతరం హామీలను తుంగలో తొక్కడవే తప్ప ఆచరణలో అమలు చేయడం లేదన్నారు. ప్రభుత్వం ఏర్పాటై మూడేళ్లు గడిచిన నియోజకవర్గంలో పద్మశాలి కమ్యూనిటీకి చేసిందేమీ లేదన్నారు. రానున్న ఎన్నికల్లో పద్మశాలీల అభ్యున్నతికి అభివృద్ధికి పాటుపడే నాయకులకు మద్దతు తెలుపుతామన్నారు. ప్రభుత్వం 52 సంవత్సరాలు నిండిన ప్రతి పద్మశాలి వ్యక్తికి ఏలాంటి నిబంధనలు లేకుండా చేనేత పింఛన్ అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం ఎన్నుకోబడిన నూతన కమిటీని యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం, యువజన సంఘం, పద్మశాలి కులస్తులు తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily