Friday, 21 August 2026 10:29:25 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

భక్తిశ్రద్ధలతో ఘనంగా శ్రావణ శుక్రవార వరలక్ష్మీ వ్రతం

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 21 August 2026 05:55 PM Views : 25

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ ఆగస్టు 21 అక్షరం న్యూస్ పెద్దపల్లి సాగర్ రోడ్డులోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శుక్రవారం, శ్రావణ శుక్రవార వరలక్ష్మీ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తోడుపునూరి వెంకటేశం, కమల దంపతులు కలిసి వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించారు. పూజా కార్యక్రమాలకు సత్యనారాయణ పండితులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది, భక్తులు పరిసర ప్రాంతాల మహిళలు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. సుమారు 30 మంది భక్తులు వ్రతంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.వరలక్ష్మీ వ్రతం సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. పాఠశాల యాజమాన్యం కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేసారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :