Sunday, 29 March 2026 01:57:53 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు ఒక బాధ్యతగా పాటించాలి రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం లో ఎస్సై దికొండ రమేష్

.


P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.

Reporter

Date : 28 March 2026 06:21 PM Views : 93

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : ఓదెల/ పెద్దపల్లి మార్చి 28 (అక్షరం న్యూస్ ) *ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను ఒక బాధ్యతగా పాటించాలని పొత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ పేర్కొన్నారు ఈ సందర్భంగా శనివారం కనగర్తి గ్రామంలో రోడ్డు భద్రత మహోత్సవం కార్యక్రమం గ్రామస్తులతో రాలి నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్సై దికొండ రమేష్ మాట్లాడుతూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి మరియు వాహనదారుల్లో క్రమశిక్షణను పెంపొందించడానికి పోత్కపల్లి పోలీస్ వారి ఆధ్వర్యంలో 'ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను ఒక బాధ్యతగా పాటించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వాహనదారులకు ఈ క్రింది కీలక సూచనలు తప్పకుండా పాటించాలని సూచించారు హెల్మెట్ మరియు సీట్ బెల్ట్*: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లు నడిపేవారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. *మైనర్ డ్రైవింగ్* : తల్లిదండ్రులు తమ మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని, ఇది చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. *మద్యం సేవించి వాహనం నడపరాదు*: మద్యం సేవించి వాహనం నడపడం వల్ల కలిగే ప్రమాదాలు వర్ణనాతీతమని మద్యం సేవించి బండి నడపడం వల్ల తమ విలువైన ప్రాణాలను కోల్పోవడం వస్తుందని తనపై ఆధారపడ్డ కుటుంబం వీధిన పడే పరిస్థితి ఏర్పడుతుందని గమనించి వీటిని పాటించాలని అన్నారు ట్రిపుల్ రైడింగ్ బైక్‌లపై ముగ్గురు ప్రయాణించడం ప్రమాదకరమని, అటువంటి చర్యలకు పాల్పడవద్దని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కేవలం పోలీసులు మాత్రమే కాకుండా, ప్రజలు కూడా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు రెడ్డి రజనీకాంత్ తో పాటు పలువురు నాయకులు ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :