Sunday, 22 November 2026 06:50:28 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తాం.. 20వ వార్డు, కౌన్సిలర్ ఉండ్రు వరలక్ష

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 21 November 2026 12:19 PM Views : 253

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/వైరా టౌన్ నవంబర్ 21 (అక్షరం న్యూస్) వైరా మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డులో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఉండ్రు వరలక్ష్మి శ్యాంబాబు శ్రీకారం చుట్టారు. ఇందిరమ్మ ఇంటి పట్టా పొందిన రాయల సులోచన నూతనంగా నిర్మించుకోనున్న ఇంటికి వార్డు కౌన్సిలర్ ఉండ్రు వరలక్ష్మి శ్యాంబాబు ముగ్గుపోసి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఉండ్రు వరలక్ష్మి శ్యాంబాబు మాట్లాడుతూ పేదలకు సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,ఎమ్మెల్యే రాందాస్ నాయక్, మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ మురళీకృష్ణా సహకారంతో వార్డులో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. 20వ వార్డులో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాణ్యతతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడం పట్ల లబ్ధిదారు రాయల సులోచన ఆనందం వ్యక్తం చేస్తూ, ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించిన కౌన్సిలర్ ఉండ్రు వరలక్ష్మి శ్యాంబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఉండ్రు శ్యాంబాబు,వార్డు నాయకులు పువ్వాళ్ల రాము, హుస్సేన్, నవీన్, ఖాజా, వెంకటేశ్వర్లు, మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ లాల్ మియా, సాయి శిరీష తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :