DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/కాల్వ శ్రీరాంపూర్ : కాల్వ శ్రీరాంపూర్/పెద్దపల్లి జిల్లా/ జనవరి 2 అక్షరం న్యూస్:పోగొట్టుకున్న ఫోన్ ని సిఈఐఆర్ పోర్టల్ ద్వారా గుర్తించి బాధితునికి అప్పగించిన పోలీసులు కాల్వ శ్రీరాంపూర్ స్టేషన్ అదే గ్రామానికి చెందిన కంధుల సురేష్ అనే వ్యక్తి ఫోన్ పోగొట్టుకోవడం తో కాల్వ శ్రీరాంపూర్ పోలీసు వారికి కంప్లైంట్ చేయగా పోలీసులు సిఈఐఆర్ పోర్టల్ లో వివరాలు నమోదు చేసి ఫోన్ ని గుర్తించి శుక్రవారం శ్రీరాంపూర్ పోలీసులు బాధితునికి ఫోన్ ని అందజేశారు.ఈ సందర్భంగా కాల్వ శ్రీరాంపూర్ పోలీసులు మాట్లాడుతూ ఎవరైనా వారి యొక్క సెల్ ఫోన్ ను పోగొట్టుకున్నా,దొంగతనానికి గురైనా అట్టి ఫోన్ వివరాలు సిఈఐఆర్ పోర్టల్ లో నమోదు చేసుకోగలరని ఈ పోర్టల్ ద్వారా మొబైల్ తిరిగి పొందే అవకాశం ఉందని ఇట్టి అవకాశం ని ప్రజలు అందరు సద్వినియోగం చేసుకోగలరని సూచించనైనది. అదేవిధంగా ఎవరికైనా మొబైల్ ఫోన్స్,అనుమానిత వస్తువులు, లేదా ఇతర విలువైన వస్తువులు గాని దొరికినట్లైతే వాటిని పోలీస్ స్టేషన్లో అప్పగించాలన్నారు
.
Aksharam Telugu Daily