D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : * ఖమ్మం/ తల్లాడ అక్టోబర్ 10 (అక్షరం న్యూస్) తల్లాడ మండలం నూతనకల్లు గ్రామంలో నిర్మిస్తున్న శ్రీ శివగిరి మణికంఠ క్షేత్ర అయ్యప్ప స్వామి ఆలయ అభివృద్ధికి రూ.1,50,000 (ఒక లక్షా యాభై వేల రూపాయలు) విరాళంగా అందజేశారు. ఆధ్యాత్మికతను పెంపొందించడంతో పాటు, ఆలయాల అభివృద్ధికి తన వంతు సహకారం అందించాలనే సదుద్దేశంతో ఈ విరాళాన్ని అందించినట్లు ఆయన తెలిపారు. హిందూ ధర్మ పరిరక్షణలో, ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రజల్లో పెంపొందించడంలో దేవాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. దేవాలయాలు కేవలం పూజా స్థలాలే కాకుండా, భక్తికి, ధర్మానికి, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలుస్తాయని అన్నారు. ఇటువంటి పవిత్ర క్షేత్రాల అభివృద్ధికి భక్తులు, దాతలు ముందుకు వచ్చి తమ వంతు సహకారం అందించాలని ఆయన ఆకాంక్షించారు. ఆలయాల అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు దాతల సహకారం ఎంతో అవసరమని పేర్కొంటూ, భవిష్యత్తులో కూడా ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలకు తన వంతు సహకారం అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. శ్రీ శివగిరి మణికంఠ క్షేత్ర అయ్యప్ప స్వామి ఆలయ అభివృద్ధికి విరాళం అందించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ఇలాంటి సహకారాలు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తాయని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు వీరబాబు ముదిరాజ్, ఎస్.కె నాగుల్ మీరా, కాంగ్రెస్ నాయకులు గోగుల వెంకటయ్య , కళ్యాణపు వెంకటయ్య, మధు తోట శ్రీకాంత్, టిఆర్ఎస్ నాయకులు నాయుడు శ్రీను పసుపులేటి ప్రభాకర్ వెంకటేశ్వర్లు గ్రామస్తులు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily