D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం అక్షరం ఫిబ్రవరి 20 వైరా వైరా స్థానిక ఎస్ ఆర్ ఠాగూర్ విద్యా సంస్థలైన క్రాంతి జూనియర్ కళాశాల లో మొదటి సంవత్సరం విద్యార్థులు ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఏర్పాటు చేసిన వీడ్కోలు సభకు విద్యాసంస్థల చైర్మన్ వాసిరెడ్డి సునీత అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల కరస్పాండెంట్ సంక్రాంతి రవికుమార్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ గలిగి సేవాభావం కలిగి అంకిత భావంతో చదువుకొని మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని పరోక్షంగా దేశ అభివృద్ధికి శాస్త్రీయ పద్ధతిలో తోడ్పడాలని,. ప్రపంచ దేశాల విద్య అవకాశాలను వినియోగించు కొని ప్రపంచీకరణ నేపథ్యంలో పోటీని తట్టుకోవాలని, ఆ రకంగా మీ తల్లిదండ్రులు మంచి పేరు తేవాలనిఅభిప్రాయపడ్డారు. అనంతరం మొదటి సంవత్సరం అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు, ఎన్ఎస్ఎస్ రెగ్యులర్ కార్యక్రమాలలో చొరవ చూపిన విద్యార్థులకు, ఆటలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు, సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు, ముగ్గుల పోటీలలో పాల్గొన్న విద్యార్థులకు డైరెక్టర్ సంక్రాంతి సంయోగిత బహుమతి ప్రధానోత్సవం చేశారు. అనంతరం విద్యార్థులు ఆట పాట నృత్యాలు చూపర్లను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కృష్ణారావు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ లింగారావు, మజీద్, వేణు, నాగలక్ష్మి, చైతన్య, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily