Wednesday, 04 March 2026 01:47:59 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

అంబరాన్ని అంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు మండలంలోని గ్రామాల్లో బతుకమ్మ ఆడుతున్న మహిళలు

.


P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.

Reporter

Date : 29 September 2025 08:55 PM Views : 997

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల/ పెద్దపల్లి సెప్టెంబర్ 29 (అక్షరం న్యూస్). సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ మహిళలు ఆడిపాడుతున్నారు ఓదెల మండలంలోని గ్రామాల్లో సోమవారం సద్దుల బతుకమ్మ  సందర్భంగా ఏర్పాట్లను ఘనంగా నిర్వహించారు. మహిళలు పిల్లలు అందరు కలిసి రంగురంగుల పూలతో పేర్చిన బతకమ్మను ఒక దగ్గర కు చేర్చి బతుకమ్మ పాటలను పాడుతూ అంగరంగ వైభవంగా డీజే పాటలతో దాండియా కోలాటాల ఆటలతో సద్దుల బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నారు .తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్ర మహిళలకు ప్రత్యేకంగా నిలుస్తుంది.తెలంగాణ సాంస్కృతికి సాంప్రదాయానికి ప్రతీకగా బతుకమ్మ పండుగ.రాష్ట్రంలో సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలందరూ రక రకాల పూలు చామంతి బంతి గుణుగు పూలు పట్టుకుచ్చులు వివిధ రకాల పూలు,రంగు రంగుల పూలతో బతుకమ్మను పేర్చి పసుపు తో చేసిన గౌరమ్మ ను పూల మధ్యకు చేర్చి పూజచేస్తారు. గ్రామంలోని మహిళలందరూ కలిసి బతుకమ్మ లను ఒక్క దగ్గర చేర్చి బతుకమ్మ పాటలతో సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగకు  ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది.సద్దుల బతుకమ్మ వేడుకల్లో మహిళలు,పిల్లలు బతుకమ్మ పాటలు పాడుతూ,కోలలతో కోలాటం ఆడూతూ అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తిశ్రద్ధలతో మహిళలందరూ కలిసి బతుకమ్మను గౌరవప్రదంగా ఆడి పాడుతున్నారు సద్దుల బతుకమ్మ సంబరాలకు ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఆదేశాల మేరకు స్థానిక పంచాయతీ కార్యదర్శులు అన్ని ఏర్పాట్లు చేశారు అదేవిధంగా బతుకమ్మ సంబరాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ తగిన బందోబస్తు నిర్వహించి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు .

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :