Mohammed Yousuf Ali. Sultanabad, Peddapally District.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి జిల్లా/ సుల్తానాబాద్ : . పెద్దపల్లి జిల్లా/ సుల్తానాబాద్/ అక్టోబరు 10/ అక్షరం న్యూస్. సుల్తానాబాద్ పట్టణంలోనీ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో పెద్దపల్లి నియోజకవర్గ స్థాయి క్రికెట్ ప్రీమియర్ లీగ్ సీజన్-2ను శనివారం రోజు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువతలో క్రీడా నైపుణ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో పోటీలను నిర్వహిస్తున్న ఆరో వార్డు కౌన్సిలర్ బాకం సాయి ను ఎమ్మెల్యే అభినందించారు. కాగా ఈ టోర్నీ లో పది జట్లు పాల్గొంటున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ రాధాకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ మినపల ప్రకాష్ రావు, జిల్లా స్పోర్ట్స్ల అధ్యక్షులు ముత్యాల రవీందర్ తో పాటు కౌన్సిలర్లు, గ్రామాల సర్పంచులు, క్రీడాభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily