D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT. Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/కొత్తగూడ : మహబూబాబాద్ జిల్లా / కొత్తగూడ/ ఆగష్టు 5(అక్షరం న్యూస్ ) కొత్తగూడ మండలం పోగుల్ల పల్లి గ్రామంలోని ఏకలవ్య పాఠశాలను *తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క* గారి ఆదేశాల మేరకు, *కాంగ్రెస్ పార్టీ మండల కాంగ్రెస్ అధ్యక్షులు బానోత్ రూపుసింగ్* గారి సూచనలతో మండల యూత్ కాంగ్రెస్ నాయకులు స్థానిక ఏకలవ్య నమూనా నివాస పాఠశాల (EMRS)ను సందర్శించారు. గత వారం రోజులుగా ఏకలవ్య పాఠశాలలో చోటుచేసుకుంటున్న వివిధ సంఘటనలు, సమస్యలపై నిజ నిర్ధారణలో భాగంగా *యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు చొప్పరి కుమార్* నాయకత్వంలో ఈ విజిట్ నిర్వహించారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న సదుపాయాలు, భోజనం నాణ్యత, వసతి గృహాల పరిశుభ్రత మరియు విద్యా బోధన తీరుతెన్నులను నాయకులు క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. పాఠశాల పరిసర ప్రాంతాలను తనిఖీ చేసి, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత ఉపాధ్యాయులను, అధికారులను కోరారు ఈ సందర్భంగా యూత్ మండల అధ్యక్షులు చొప్పరి కుమార్ మాట్లాడుతూ... గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు అందించాలనేది మంత్రి సీతక్క గారి ముఖ్య ఉద్దేశమని తెలిపారు. పాఠశాలలో ఏవైనా లోపాలు లేదా సమస్యలు ఉంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థుల సంక్షేమం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ విజిట్ కార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ నాయకులు,నోముల ప్రశాంత్,వల్లెపు రంజిత్,బోయినేని ప్రశాంత్ రెడ్డి,కుంజా రాకేష్, కుమ్మరి గుడి సునీల్, శేఖర్,యాదగిరి కిరణ్,ముఖ్య కార్యకర్తలు మరియు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు....
.
Aksharam Telugu Daily