AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మేడ్చల్ /కుత్బుల్లాపూర్ : : టెన్ ప్లస్ టు విద్యా విధానంపై మేధావులు, విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయుల సలహాలు, సూచనలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లాలని యుఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు ఎం చంద్రకాంత్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఒక పత్రిక ప్రకటనలో మాట్లాడుతూ విద్యా విధానంలో ఏదైనా మార్పు తీసుకొచ్చే ముందు క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోవాలన్నారు. విద్యార్థుల భవిష్యత్ తో ముడిపడి ఉన్న అంశం కాబట్టి హడావిడిగా నిర్ణయాలు తీసుకోకుండా అన్ని వర్గాలతో చర్చించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయుల కొరత, ఫీజుల భారం, స్కాలర్ షిప్ లు, బస్ పాస్ సమస్యలు వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. గ్రామీణ, పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యను వ్యాపారంగా మార్చకుండా ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం రానున్న రోజుల్లో ఉద్యమాలు, ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని, విద్యార్థి సంఘాలతో సమావేశాలు నిర్వహించి వారి సూచనలను విధానంలో చేర్చాలని చంద్రకాంత్ కోరారు.
.
Aksharam Telugu Daily