Saturday, 18 April 2026 06:40:24 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఎరువులు ,విత్తనాల స్టాక్, సేల్స్ రిజిస్టర్ లను పకడ్బందీగా నిర్వహించాలి :: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

ఎరువులు ,విత్తనాలు నిబంధనలు ప్రకారం విక్రయించాలీ యూరియా స్టాక్ లేని మన గ్రోమోర్ దుకాణంకు నోటీసులు జారీ రైతులకు నాణ్యమైన విత్తనాలు మాత్రమే విక్రయించాలి నకిలీ విత్తనాలు అమ్మితే కఠినంగా చర్యలు తీసుకుంటాం ముస్తాబాద్ మండలంలోని ఎరువులు విత్తనాల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్


GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLA

Reporter

Date : 10 July 2025 05:46 PM Views : 1412

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల/ముస్తాబాద్,/ జూలై-10(అక్షరం న్యూస్) జిల్లాలో ఎరువులు , విత్తనాల స్టాక్, సేల్స్ రిజిస్టర్ లను పకడ్బందీగా నిర్వహించాలని విక్రయదారులను, అధికారులను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. గురువారం ముస్తాబాద్ మండలంలోని శ్రీనివాస్ ఎరువులు & విత్తనాలు, కోరమండల్ మన గ్రోమోర్, విక్రయ దుకాణాలను , గోదాములను, ఆవునూరులోని ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంలను ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, ఎరువులు & విత్తనాలు దుకాణాల్లో ఎరువులు, విత్తనాలను పరిశీలించి వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. శ్రీనివాస్ ఎరువులు & విత్తనాలు, కోరమండల్ మన గ్రోమోర్ విక్రయ దుకాణాలలో, ఆవునూరు లోని ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంలోని సేల్స్ రిజిస్టర్ మరియు స్టాక్ రిజిస్టర్ పరిశీలించి గోదాం ను తనిఖీ చేయగా కోరమండల్ మన గ్రోమోర్ గోదాములో యూరియా స్టాక్ లేనట్లు గమనించి సదరు దుకాణంకు నోటీసులు జారీ చేయవలసిందిగా తెలిపారు. సదరు నోటీసులకు సరైన సంజాయిషీ సమర్పించి యూరియా స్టాక్ వెంటనే తెప్పించాలని ఆదేశించారు. నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ స్పష్టం చేశారు. నాణ్యమైన విత్తనాలు మాత్రమే రైతులకు అందజేయాలని , కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు ఉంటాయని విక్రయ యజమానులను కలెక్టర్ ఆదేశించారు. ఈ పర్యటనలో జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జలి బేగం,సంబంధితవ్యవసాయ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :