Thursday, 15 October 2026 04:23:10 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

అక్టోబర్ 21 నుండి 31 వరకు పోలీస్ అమరవీరుల సంస్మరణ (పోలీస్ ఫ్లాగ్ డే) వారోత్సవాలు.. పోలీస్ కమిషనర్ సునీల్ దత్

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 14 October 2026 05:42 PM Views : 67

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ అక్టోబర్ 14 (అక్షరం న్యూస్) పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (పోలీస్ ఫ్లాగ్ డే) సందర్భంగా ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్టోబర్ 21 నుంచి 31వ తేదీ వరకు దేశ శాంతిభద్రతలు, ప్రజల రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఓపెన్ హౌస్ కార్యక్రమాలు పోలీస్ స్టేషన్లలో ఓపెన్ హౌస్ కార్యక్రమాలు నిర్వహించి పోలీసుల విధులు, ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానం, ప్రజల రక్షణలో పోలీసుల సేవలు, పోలీసుల ప్రతిభ, త్యాగాలను ప్రజలకు వివరించనున్నారు. వ్యాసరచన పోటీలు విద్యార్థులకు(12వ తరగతి వరకు ఉన్న విద్యార్థుల కోసం ) 1.సైబర్ నేరాల నివారణలో పోలీసు పౌరుల యొక్క పాత్ర. 2.డ్రగ్స్ నిర్వహణ: నివారణలో పోలీసుల పాత్ర మరియు విద్యార్థులు డ్రగ్స నుండి ఎలా దురంగా ఉండగలరు. డిగ్రీ మరియు అంతకంటే పై స్థాయి విద్యార్థుల కోసం. 1.సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టడంలో పోలీసుల పాత్ర 2.తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో నా పాత్ర పోలీస్ సిబ్బందికి రెండు కేటగిరీల్లో వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నారు. కేటగిరీ–1: కానిస్టేబుల్ నుంచి ఏఎస్‌ఐ స్థాయి వరకు 1.ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు పోలీసుల నుండి ఎటువంటి సేవలను ఆశిస్తారు? 2.పోలీసు అధికారుల జీవితాల్లో సోషల్ మీడియా పాత్ర మీడియాకు బానిస కాకుండా ఉండటం మరియు వ్యక్తిగత, సామాజిక ప్రయోజనాల కోసం దానిని సద్వినియోగం చేసుకోవడం ఎలా. కేటగిరీ–2: ఎస్‌ఐ మరియు పై స్థాయి అధికారులకు 1.పౌరులమన్ననలు పొందటానికి పోలీసులు చేయవలసిన కృషి. 2.క్షేత్రస్థాయి పోలీసు వ్యవస్థను బలోపేతం చేయడం. ఈ పోటీలను తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో నిర్వహించనున్నారు. వ్యాసం 500 పదాలకు మించకూడదు. ప్రతిభ కనబరిచిన మొదటి ముగ్గురికి అవార్డులు అందజేయడంతో పాటు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తారు. ???? రక్తదాన శిబిరాలు, సైకిల్ ర్యాలీలు: పోలీస్ అమరవీరుల స్మరణార్థం రక్తదాన శిబిరాలు,సైకిల్ ర్యాలీలు నిర్వహించనున్నారు. సైకిల్ ర్యాలీల్లో యువత, విద్యార్థులను పెద్ద సంఖ్యలో భాగస్వామ్యం చేయనున్నారు. అమరవీరుల కుటుంబాల పరామర్శ: పోలీస్ అధికారులు అమరవీరుల కుటుంబాల ఇళ్లకు స్వయంగా వెళ్లి వారిని పరామర్శించి, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నారు. అమరవీరుల విగ్రహాలు లేదా ఫొటోలు ఉన్న ప్రాంతాల్లో ఇన్‌స్పెక్టర్ స్థాయి లేదా అంతకంటే పై స్థాయి అధికారులు గ్రామ పెద్దలు,యువత, విద్యార్థుల సమక్షంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించనున్నారు. షార్ట్ ఫిల్మ్, ఫోటోగ్రఫీ పోటీలు: పోలీస్ అమరవీరుల త్యాగాలు,పోలీసుల విధులు,ప్రతిభ, ప్రజల రక్షణ వంటి అంశాలపై యువత, ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లు షార్ట్ ఫిల్మ్,ఫోటోగ్రఫీ పోటీల్లో పాల్గొనాలని కమిషనర్ కోరారు. పాల్గొనేవారు 3 ఫోటోలు మరియు 3 నిమిషాలకు మించని షార్ట్ ఫిల్మ్ రూపొందించి సమర్పించాలి. ఫోటోలు 10×8 అంగుళాల పరిమాణంలో ఉండాలి. షార్ట్ ఫిల్మ్‌ను పెన్‌డ్రైవ్‌లో పూర్తి వివరాలతో అందజేయాలి. కమిషనరేట్ స్థాయిలో ఎంపికైన మూడు ఉత్తమ షార్ట్ ఫిల్మ్స్,ఫోటోలను రాష్ట్రస్థాయి పోటీల కోసం డీజీపీ కార్యాలయం, హైదరాబాద్‌కు పంపించనున్నారు. ఫోటోలు,షార్ట్ ఫిల్మ్‌లను అక్టోబర్ 23వ తేదీ సాయంత్రంలోగా పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని పోలీస్ పి ఆర్ వో (8712659256) కార్యాలయంలో అందజేయాలి. అక్టోబర్ 21న స్మృతి పరేడ్: అక్టోబర్ 21న పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో భాగంగా “స్మృతి పరేడ్”, “పోలీస్ ఫ్లాగ్ డే” కార్యక్రమాలను పోలీస్ హెడ్ క్వాటర్స్ పరేడ్ గ్రౌండ్స్ లోని స్మారక స్థూపం వద్ద ఘనంగా నిర్వహించి అమరవీరులకు నివాళులు అర్పించనున్నట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :