AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం/జూలూరుపాడు/అక్టోబరు02/అక్షరం న్యూస్: తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్(ఐజెయూ) జూలూరుపాడు మండలం నూతన అధ్యక్షుడిగా చాపలమడుగు నరసింహారావును నియమించారు. ఈ మేరకు TUWJ (IJU) జిల్లా అధ్యక్షులు రత్నం చేతుల మీదుగా నియామక పత్రాన్ని చాపలమడుగు నరసింహారావుకు అందజేశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు నరసింహారావు మాట్లాడుతూ యూనియన్ నియమ నిబంధనలు కట్టుబడి మండలంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి, జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు.నూతనంగా నియమితులైన అధ్యక్షుడు చాపలమడుగు నరసింహారావుకు పలువురు జర్నలిస్టులు,నాయకులు,మిత్రులు అభినందనలు తెలిపారు.
.
Aksharam Telugu Daily