Saturday, 18 April 2026 02:13:55 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

కాంగ్రెస్ సర్కారులో రోడ్లకు మహర్దశ.

ప్రతి నిరుపేదకు ఇల్లు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే విజ్జన్న నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం పని చేస్తున్నాo ఎమ్మెల్యే 12.97 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు


P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.

Reporter

Date : 09 June 2025 04:35 PM Views : 1110

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల/పెద్దపల్లి జూన్ 09 (అక్షరం న్యూస్) ఓదెల మండలంలో సోమవారం ఓదెల గ్రామం నుండి కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి వరకు డి.ఎ.ఎఫ్.టీ ద్వారా ₹12 కోట్ల 75 లక్షల రూపాయల నిధులతో డబల్ రోడ్డు పనులకు శంకుస్థాపన మరియు ఓదెల మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ నుండి డి 86 కెనల్ వరకు సి.సి రోడ్డు నిర్మాణం కోసం ₹10 లక్షల రూపాయల నిధులతో శంకుస్థాపన చేసి అనంతరం అంగన్వాడీ భవన నిర్మాణం కోసం ఎం.జి.ఎన్.ఆర్.ఈ. జి.ఎస్ నిధుల ద్వారా ₹12 లక్షల రూపాయల నిధులతో శంకుస్థాపనలు చేసిన అనంతరం ఇందిరమ్మ ఇండ్లకు నూతన నిర్మాణాలకు ముగ్గులు పోసిన గౌరవ పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు గారు.. అనంతరం ఓదెల మండలం పిట్టల ఎల్లయ్యపల్లి గ్రామంలో రేషన్ షాపు ప్రారంభించిన అనంతరం ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గులు పోసి ఇండ్ల పట్టాలు అందజేసిన ఎమ్మెల్యే విజయరమణ రావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ... ఓదెల మండల కేంద్రం నుండి పెగడపల్లి వరకు 12 కోట్ల 75 లక్షల రూపాయలతో డబల్ రోడ్డు నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఓదెల నుండి మల్లికార్జున స్వామి దేవాలయం వరకు సెంట్రల్ లైటింగ్ సిస్టం కు 10 కోట్లు నిధులు వెచ్చించి ఏర్పాటు చేస్తాను అన్నారు. కొమిర , భీమారం పల్లె మల్లికార్జున స్వామి దేవాలయం వరకు రెండు కోట్లతో ఫార్మేషన్ కూడా చేయడం జరిగిందన్నారు. రెండు కోట్లతో జీలకుంట, భీమార .పల్లె చిన్న కొమి ర వరకు బీటు రోడ్ కూడా మంజూరు చేసుకోవడం జరిగిందని త్వరలో ఆ పనులు కూడా ప్రారంభిస్తామన్నారు. గ్రామస్తుల కోరిక మేరకు మానేరు నీరు త్రాగించేందుకు 90 లక్షల నిధులతో రెండు వాటర్ ట్యాంకుల నిర్మాణం కూడా ప్రారంభిస్తామన్నారు. కాల్వ శ్రీరాంపూర్ నుంచి పోత్కపల్లి వరకు బీటీ రోడ్ 25 కోట్లు మంజూరు చేయడం జరిగిందని పనులు కూడా జరుగుతున్నాయి అన్నారు. ప్రస్తుతం పైపులన్నీ డ్యామేజ్ కావడం వలన నీరు రాక ఇబ్బందులు ఏర్పడుతున్నాయని మిషిన్ భగీరథ పనులలో భాగంగా పనులు పూర్తి చేయిస్తానన్నారు. నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే సంపును మంజూరు చేయించాను అన్నారు. గత ప్రభుత్వంలో రైతుల పండించిన వారి ధాన్యంలో ధాన్యం కటింగ్ పేరా నిలువునా దోచుకున్నారని నేను ఎమ్మెల్యే అయిన తర్వాత గింజ కటింగు లేకుండా వరి ధాన్యం అందిస్తానని మాట ఇచ్చి ఆ మాట ప్రకారం ఈ నియోజకవర్గంలో గింజ కటింగ్ లేకుండా వరి ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేయడం జరుగుతుంది అన్నారు. రేవంత్ రెడ్డి మాట ఇచ్చిన ప్రకారం సన్న వడ్లకు బోనస్ పడుతుంది అన్నారు. ఈ వారం రోజుల్లో ఈ వేసవిలో పండించిన సన్న వడ్లకు మన నియోజకవర్గంలో 31 కోట్లు రైతుల ఖాతాలో జమ అయితాయి అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వం 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిందన్నారు. ఓదెల, పిట్టలఎల్లయ్యపల్లి గ్రామాలల్లో మంజూరైన ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గురు పోయడం జరిగింది అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం రేషన్ షాపులలో సన్న బియ్యం పేదలకు ఇవ్వడం జరుగుతుంది అన్నారు. ప్రభుత్వం సన్న వడ్లకు బోనస్ ఇవ్వడంతో సీడ్ కంపెనీలు దిగివచ్చి వారే సీడ్ వరి విత్తనాలు ఇవ్వడంతో పాటు కంపెనీ వారి హార్వెస్టింగ్ చేసి గతం ఉన్న ధర కంటే సుమారు 1000 నుంచి 2000 రూపాయలు ఎక్కువ పెట్టి రైతుల వద్ద నుంచి సీడ్ వరి ధాన్యం తీసుకుంటున్నారు అన్నారు. ఓదెల మండలంలోని అన్ని గ్రామాల్లో నిధులు వెచ్చించి అభివృద్ధి లక్ష్యంగా పనిచేయడం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో ఓదెల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి సింగిల్ విండో చైర్మన్, ఆళ్ల సుమన్ రెడ్డి డైరెక్టర్లు, చింతo కుమారస్వామి నాయకులు చీకట్ల మొండయ్య పడాల రాజు అంబాల కొమురయ్య కట్కూరి సమ్మిరెడ్డి . పిట్టల రవికుమార్ యాదగిరి సమ్మయ్య తోపాటు రెడ్డి రజనీకాంత్ బోడకుంటే చిన్నస్వామి శంకర్ మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్ గడిగొప్పుల సంతోష్ గోకు నారాయణరెడ్డి చొప్పరి రాజయ్య రాజేశం నోముల సాగర్ రెడ్డి పందెన . నరసింగం పచ్చిమట్ల శ్రీనివాస్ గౌడ్ క్యాతం వెంకన్న. పిట్టల నర్సింగం మాజీ. సర్పంచ్ లు,ఎంపీటీసీ లు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :