P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల పెద్దపల్లి అక్టోబర్ 05 (అక్షరం న్యూస్) ఓదెల మల్లికార్జున స్వామి ఆలయ సమీపంలో ఈరవేన ఓదయ్య వ్యవసాయ బాయి సమీపంలో గత వారం రోజుల క్రితం పైపులైను పగిలి వృధాగా పోతున్న నీరు పట్టించుకోని అధికారులు . ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు చేపట్టిన మిషన్ భగీరథ పథకం అధికారుల నిర్లక్ష్యానికి గురవుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామంలోని ప్రధాన పైపులైన్ పగిలిపోవడంతో భారీగా తాగునీరు వృథాగా పోతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైపులైన్ నుంచి నీరు సమీప పొలాలలోకి ప్రవహిస్తూ విలువైన తాగునీరు వృథా అవుతోంది. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా మరమ్మతులు చేపట్టకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు పైపులైన్ లీకేజీతో నీరు వృథా అవుతుండటం అధికారుల పర్యవేక్షణ తీరుపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి పగిలిన పైపులైన్‌కు వెంటనే మరమ్మతులు చేపట్టి తాగునీటి వృథాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.
.
Aksharam Telugu Daily