Saturday, 18 April 2026 01:55:29 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

14న ‘విత్తనం నుండి మహావృక్షంగా వనజీవి జీవితం’ పుస్తకావిష్కరణ... ముఖ్య అతిథిగా హాజరు కానున్న...

జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 11 September 2025 07:08 PM Views : 468

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ సెప్టెంబర్ 11 (అక్షరంన్యూస్) వర్ధమాన రచయిత నరేష్ జిల్లా రచించిన ‘విత్తనం నుండి మహావృక్షంగా వనజీవి జీవితం’ పుస్తకావిష్కరణ, పరిచయ సభ ఈ నెల 14న ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఖమ్మంలోని ఆక్స్‌ఫర్డ్ హైస్కూల్‌లో జరుగుతుందని అక్షరాల తోవ నిర్వాహకులు నామా పురుషోత్తం, దాసరోజు శ్రీనివాస్, రాచమళ్ల ఉపేందర్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. వనజీవి రామయ్య జీవిత చరిను నరేష్ జిల్లా పుస్తకంగా మలిచినట్లు తెలిపారు. ఈ సభకు ముఖ్య అతిథిగా జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్ హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. ఈ పుస్తకాన్ని ప్రముఖ కవి, కాళోజీ అవార్డు గ్రహీత డాక్టర్ సీతారాం పరిచయం చేయనున్నట్లు తెలిపారు. ప్రముఖ రచయిత, విమర్శకులు సైదులు ఐనాల, ప్రముఖ రచయిత్రి వురిమళ్ల సునంద, ప్రముఖ సామాజిక వేత్త కడవెంటి వేణుగోపాల్, ప్రముఖ రచయిత వ్యక్తిత్వ వికాస నిపుణులు అట్లూరి వెంకటరమణ, ప్రముఖ కవి నయీమ్ పాషా, ఆక్స్‌ఫర్డ్ హైస్కూల్ కరెస్పాండెంట్ ఎం.డి జాఫర్ మతీన్, వనజీవి రామయ్య సతీమణి జానకమ్మ పాల్గొనున్నట్లు తెలిపారు. జిల్లాలోని కవులు, రచయితలు, సాహితీవేత్తలు, సాహిత్యాభిలాషులు, సాహిత్య పోషకులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :