D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ సెప్టెంబర్ 8/ వైరా (అక్షరంన్యూస్) వైరా: శాంతి భద్రతల పర్యవేక్షణలో మంచి పేరున్న పోలీస్ ఆఫీసర్ గా, బైంసా, నిర్మల్ లాంటి సమస్యాత్మక ప్రాంతాలలో కూడా అందరికీ చక్కటి ప్రోత్సాహం అందించి శాంతి భద్రతలు నిర్వర్తించి పై అధికారుల మన్ననలు పొంది, సమస్యాత్మక ప్రాంతాలలో ఎస్సై పుష్పాల రామారావు ఉంటే చక్కగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా లాండ్ ఆర్డర్ నడుస్తుందని పేరు గడించిన మన వైరా ఎస్సై పుప్పాల రామారావు కి వైరా మున్సిపాలిటీ తొలి మాజీ వైస్ చైర్మన్ ముళ్ళపాటి సీతారాములు, శ్రీ సాయి గజానన ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అభినందనలు తెలిపి శాలువాతో సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ నిమజ్జనం పూర్తయ్యేంతవరకు శాంతి భద్రతలు చక్కగా పర్యవేక్షించి మాకు చక్కని సహకారం అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు ఊరుకొండ శ్రీనివాసరావు ముళ్లపాటి రంగారావు కొమిరిశెట్టి శ్రీధర్, పిఆర్టియు వైరా మండల అధ్యక్షులు వెలిశెట్టి నరసింహారావు ప్రధాన కార్యదర్శి వేమిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, కమిటీ సభ్యులు రామిశెట్టి శ్రీనివాసరావు ముటుకుల రాజేశ్వరరావు ప్రణయ్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily