Tuesday, 10 February 2026 08:25:54 AM
 Breaking
     -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

గిరిజనుల అభ్యున్నతికే వనవాసీ జిల్లా సంఘటనా కార్యదర్శి కోరం

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 21 August 2025 08:30 PM Views : 525

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/చర్ల : భద్రాద్రి కొత్తగూడెం/చర్ల ఆగస్టు 21/ అక్షరం న్యూస్/--- గిరిజనుల అభ్యున్నతి కొరకే వనవాసీ కళ్యాణ పరిషత్ ఏర్పాటయిందని సంస్ద జిల్లా సంఘటనా కార్యదర్శి కోరం సూర్యనారాయణ అన్నారు. చర్ల మండలం మొగళ్లపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి యాలం నవిత తిరుపతి ల కుమార్తె దర్శిక ద్విజ జన్మదినం సందర్భంగా వనవాసీ కళ్యాణ పరిషత్ కొమరం భీం విద్యార్ది నిలయం కు 25 కేజీల బియ్యం కూరగాయలు నిత్యావసర సరుకులను అందచేసారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సూర్యనారాయణ మాట్లాడారు. దేశ వ్యాప్తంతగా ఉన్న గిరిజనులలో చైతన్యం నింపేందుకు వనవాసీ సేవలను అందచేస్తున్నట్లు వివరించారు.గిరిజన విద్యార్దులకు విద్యను అదించేందుకు దేశ వ్యాప్తంతగా 526 రాష్ట్రాలలో వనవాసీ విద్యార్ది నిలయాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఛత్తీస్‌ఘడ్ లోని జస్ పూర్ లో ఏడుగురు విద్యార్థులతో ప్రారంభమైన సంస్ద నేడు దేశ వ్యాపితంగా 256 విద్యార్ది నిలయాలను ఏర్పాటు చేసి వేలాదిమంది విద్యార్దులకు విద్యను అందిస్తుందని వెల్లడించారు. ఇందుకు గాని గిరిజన అభ్యన్నతి కొరకు ఏడు లక్షల మంది కార్యకర్తలు స్వచ్ఛందంగా తమ సేవలను అందచేస్తున్నారని వివరించారు. పంచాయతీ కార్యదర్శి యాలం నవిత మాట్లాడుతూ గిరిజనుల అభ్యున్నతి కొరకు సంస్ద చేస్తున్న సేవలు తమను ఎంతగానో ఆకట్టుకున్నాయని వెల్లడించారు. విద్యతో పాటు జాతీయ భావం, దేశభక్తి పెంపొందించడం సంతోషకరమని పేర్కొన్నారు. ఇక్కడి విద్యార్దుల నడవడిక క్రమ శిక్షణ తమను ఎంతగానో ఆకట్టుకుందని తెలిపారు. విద్యార్దులు ఇటువంటి అవకాశాలను సద్వినియోగ పరుచుకొని చదువుపై శ్రద్ద వహించడం ద్వారా ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. నిలయ కమిటీ కార్యదర్శి జవ్వాది మురళీకృష్ణ మాట్లాడుతూ విద్యార్ది నిలయం పేద గిరిజన విద్యార్దులకు అందింస్తున్న సేవలను గుర్తించి దాతలు సహకారం అందించడం సంతోషకరమని పేర్కొన్నారు. విద్యార్దుల చదువులకు సహకరించేందుకు మరింత మంది దాతలు ముందుకు రావాలని ఆయన కోరారు. విద్యార్ది నిలయం కు బియ్యం కూరగాయలు అందచేసిన దాతలకు నిలయ కమిటీ తరపున కృతజ్ఞతలు తెలియచేసారు. కార్యక్రమంలో నిలయ కమిటీ ఉపాద్యక్షులు గోగికార్ రామలక్ష్మణ్ నిలయ ప్రముఖ్ గొంది ప్రసన్న కుమారి తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :