GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్ : కరీంనగర్/వీణవంక/జనవరి 12/అక్షరం న్యూస్: వీణవంక మినీ మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర రెండు సంవత్సర ఒకసారి పాడి రామకృష్ణారెడ్డి, పాడి ఉదయానందన్ రెడ్డి, ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. 2026 సంవత్సరంలో జరగబోయే సమ్మక్క- సారలమ్మ జాతర 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈనెల 28 నుండి ఆధ్యాత్మిక వేడుకలు నిర్వహిస్తున్నామని పాడి ఉదయ్ నందన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వీణవంకలో జరిగే మినీ మేడారం జాతరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనవలసిందిగా మర్యాదపూర్వకంగా కలిసి 50 సంవత్సరాల ఆహ్వాన పత్రికను ప్రత్యేకంగా అందజేశారు.
.
Aksharam Telugu Daily