D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/స్టాఫ్ రిపోర్టర్ జనవరి 11 వైరా (అక్షరం న్యూస్) వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన 264 మంది ముస్లిం మైనారిటీ మహిళ లబ్ధిదారులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కుట్టుమిషన్లు పంపిణీ చేశారు అనంతరం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు శీలం వెంకట నర్సిరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే రామదాసు నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముస్లిం మైనారిటీ అభివృద్ధి సంక్షేమం కోసం పెద్దపీట వేస్తుందని ఆయన అన్నారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి దీవించిన అందరికీ ధన్యవాదాలు అని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటుంది కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీని దీవించాలని మైనార్టీ సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని స్నేహభావంగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సమాన భావంతో పని చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆయన అన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇందిరమ్మ ఇండ్లు రైతు భరోసా రైతు భీమా మహిళలకు వడ్డీ లేని రుణాలు వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రజా ప్రభుత్వం ఎల్లవేళలా సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. గత పది సంవత్సరాల లో కేసీఆర్ హయాంలో డబుల్ బెడ్ రూమ్ పేరుకే పథకం కానీ ప్రజలకు లబ్ధి చేకూరలేదని కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలోనే ఈ ప్రజా ప్రభుత్వంలో నియోజకవర్గంలో సుమారు 4500 ఇండ్లు మంజూరు చేసి లబ్ధిదారులు త్వరలోనే గృహప్రవేశాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని తిరిగి రెండో విడత ఏప్రిల్ నెలలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని ఆయన అన్నారు. నియోజకవర్గంలోని ఐదు మండలాలలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించిన ప్రజలందరికీ నాయకత్వానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. పనిచేసే నాయకత్వాన్ని ఎప్పుడు బలపరచాలని పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వాన్ని ఎల్లవేళలా దీవించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్. పీసీసీ కార్యదర్శి కట్ల రంగన్న వైరా మార్కెట్ కమిటీ చైర్మన్ బోళ్ల గంగారావు మండల పార్టీ అధ్యక్షుడు శీలం వెంకట నర్సిరెడ్డి పట్టణ అధ్యక్షుడు ఏదునూరి సీతారాములు వైరా మున్సిపల్ మాజీ చైర్మన్ సూతకాని జైపాల్ పమ్మి అశోక్. పొదిల హరినాథ్. రాంపుడి రోశయ్య కట్ల సంతోష్ వీరంశెట్టి సీతారాములు దాసరి దానియల్ పల్లపు కొండలు. బత్తుల గీత ఐదు మండలాల ఎంపీడీవోలు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily